Seppavayyaa imkaa nee pe semtalu vinemgaani

చెప్పవయ్యా ఇంకా నీ పె చేఁతలు వినేఁగాని
Language

(॥పల్లవి॥)
చెప్పవయ్యా ఇంకా నీ పె చేఁతలు వినేఁగాని
ఇప్పుడు నీవద్దనున్న దెవ్వతెయ్యా యీపె

(॥చెప్ప॥)
వేడుకతో నల్ల నాఁడు వీదివెంట నీవు రాఁగా
ఆడరాని మాఁటాడిన ఆపెవో యీపె
జాడతోడ నీతోను సరి వెనఁగుకొంటాను
వోడక నిన్నుఁ జన్నుల నొత్తినాపె యీపె

(॥చెప్ప॥)
గుట్టున నెవ్వతెతోనో కోరి నీవు మాఁటాడఁగా
అట్టె కొంగువట్టి తీసినాపె యీపె
పొట్టఁబొరుగుననే నీ బుజాన రేకలు దీసి
రట్టు సేసినట్టు జగరాఁగా యీపె

(॥చెప్ప॥)
సేసవెట్టి పెండ్లాడిన చెలుచెల్లా నుండఁగాను
ఆసలు మీకు రేఁచిన ఆపె యీపె
రాసికెక్క శ్రీవేంకటరమణ నన్నేలితివి
వాసితో నిన్నుఁ జెనకేవాడికాపె యీపె

(||pallavi||)
sĕppavayyā iṁkā nī pĕ sem̐talu vinem̐gāni
ippuḍu nīvaddanunna dĕvvadĕyyā yībĕ

(||sĕppa||)
veḍugado nalla nām̐ḍu vīdivĕṁṭa nīvu rām̐gā
āḍarāni mām̐ṭāḍina ābĕvo yībĕ
jāḍadoḍa nīdonu sari vĕnam̐gugŏṁṭānu
voḍaga ninnum̐ jannula nŏttinābĕ yībĕ

(||sĕppa||)
guṭṭuna nĕvvadĕdono kori nīvu mām̐ṭāḍam̐gā
aṭṭĕ kŏṁguvaṭṭi tīsinābĕ yībĕ
pŏṭṭam̐bŏrugunane nī bujāna regalu dīsi
raṭṭu sesinaṭṭu jagarām̐gā yībĕ

(||sĕppa||)
sesavĕṭṭi pĕṁḍlāḍina sĕlusĕllā nuṁḍam̐gānu
āsalu mīgu rem̐sina ābĕ yībĕ
rāsigĕkka śhrīveṁkaḍaramaṇa nannelidivi
vāsido ninnum̐ jĕnagevāḍigābĕ yībĕ