Seppavayyaa iga nemi sedamu manamu nemdu

చెప్పవయ్యా ఇక నేమి సేతము మనము నేఁడు
Language

(॥పల్లవి॥)
చెప్పవయ్యా ఇక నేమి సేతము మనము నేఁడు
చెప్పరాని వలపులు చిగిరించఁ జొచ్చెను

(॥చెప్పె॥)
వేడుకకు వెల దేమి వెన్నెల చేతికి రాదు
ఆడేటిసవతిమాట అందము కాదు
వీడె మియ్యవచ్చేవు విభుఁడవు నీవైతే
నీడనుండే యలసేను నే నిన్నుఁ జూచి

(॥చెప్ప॥)
కోరికె కేడ మొదలు కుచా లెప్పుడుఁ గదలు
సేరుపుతోడియాసలు నిండువెదలు
చేరేవు నీవయితే సేసవెట్టినవాఁడవు
నీరులేక మునింగేను నిండు జెమటలను

(॥చెప్ప॥)
సిగ్గుల కేడ నెలపు చేకొన నీవు గలవు
అగ్గమైన రతికి కాయమే వొళవు
నిగ్గులో శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
దగ్గరకే కూడితిమి తలఁపులో నిన్నును

(||pallavi||)
sĕppavayyā iga nemi sedamu manamu nem̐ḍu
sĕpparāni valabulu sigiriṁcham̐ jŏchchĕnu

(||sĕppĕ||)
veḍugagu vĕla demi vĕnnĕla sedigi rādu
āḍeḍisavadimāḍa aṁdamu kādu
vīḍĕ miyyavachchevu vibhum̐ḍavu nīvaide
nīḍanuṁḍe yalasenu ne ninnum̐ jūsi

(||sĕppa||)
korigĕ keḍa mŏdalu kusā lĕppuḍum̐ gadalu
serubudoḍiyāsalu niṁḍuvĕdalu
serevu nīvayide sesavĕṭṭinavām̐ḍavu
nīrulega muniṁgenu niṁḍu jĕmaḍalanu

(||sĕppa||)
siggula keḍa nĕlabu segŏna nīvu galavu
aggamaina radigi kāyame vŏḽavu
niggulo śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
daggarage kūḍidimi talam̐pulo ninnunu