Seppavayyaa aa suddulu sevulaaraa vinemu

చెప్పవయ్యా ఆ సుద్దులు చెవులారా వినేము
Language

(॥పల్లవి॥)
చెప్పవయ్యా ఆ సుద్దులు చెవులారా వినేము
ముప్పిరిగాఁ జెలులతో ముచ్చటలాడేవు

(॥చెప్ప॥)
యేకతాన నాపె నీతో నేమని విన్నవించెనో
చేకొని సంతోసానఁ జెలరేఁగేవు
ఆకుమడిచిచ్చినప్పు డాస లేమివెట్టెనో
జోకతోఁ గళలు దేరీ సొంపుగ నీమొగము

(॥చెప్ప॥)
సరుసఁ గూచుండి యేమిసన్నలు నీకుఁ జేసెనో
శిరసెత్తి నవ్వుకొంటాఁ జమ్మిరేఁగేవు
విరులుముడిచేవేళ వేడుక లేమిచూపెనొ
గరిమతో రతులకుఁ గడుఁదమకించేవు

(॥చెప్ప॥)
పాదాలు గుద్దుతా నేమి పక్కఁన జెనకెనో
ఆదరించి కాఁగిలించి యానందించేవు
పొదితోడ నేలిత విప్పుడు శ్రీవేంకటేశ్వర
పాదుకొని నీలోనీవే భావించి మెచ్చేవు

(||pallavi||)
sĕppavayyā ā suddulu sĕvulārā vinemu
muppirigām̐ jĕlulado muchchaḍalāḍevu

(||sĕppa||)
yegadāna nābĕ nīdo nemani vinnaviṁchĕno
segŏni saṁtosānam̐ jĕlarem̐gevu
āgumaḍisichchinappu ḍāsa lemivĕṭṭĕno
jogadom̐ gaḽalu derī sŏṁpuga nīmŏgamu

(||sĕppa||)
sarusam̐ gūsuṁḍi yemisannalu nīgum̐ jesĕno
śhirasĕtti navvugŏṁṭām̐ jammirem̐gevu
virulumuḍiseveḽa veḍuga lemisūbĕnŏ
garimado radulagum̐ gaḍum̐damagiṁchevu

(||sĕppa||)
pādālu guddudā nemi pakkam̐na jĕnagĕno
ādariṁchi kām̐giliṁchi yānaṁdiṁchevu
pŏdidoḍa nelida vippuḍu śhrīveṁkaḍeśhvara
pādugŏni nīlonīve bhāviṁchi mĕchchevu