చెప్పవద్దా బుద్దులు నీచెలువునికి
(॥పల్లవి॥)
చెప్పవద్దా బుద్దులు నీచెలువునికి
వుప్పతించ కేలుంటివే వొడివట్టఁగాను
(॥॥)
విందువలె నాతనిచే విడెము నే నందుకోఁగా
సందుడి నీవేల జరసేవే
పొందుసేసి నీవింతేసి పూనుక వచ్చేదానవు
యెందుంటివే నన్నతఁడు యేలుకొనఁగాను
(॥॥)
వొద్దనుండి నేనాతని కూడిగాలు సేయఁగాను
గద్దించి నీవేఁటికిఁ గాఁతాళించేవే
సుద్దులే చెప్పుచు వట్టిసూడు వట్టేదానవు
తిద్దుకోవద్దటవే యీ తెరవు రాఁగాను
(॥॥)
గక్కన శ్రీవేంకటేశుకాఁగిట నేఁ గూడఁగాను
వెక్కసాన నేమిటికి వెరగందేవే
అక్కరతో నెడచొచ్చి ఆయాలంటేదానవు
మొక్కి వేఁడుకొనవదా ముందుముందుగా
(||pallavi||)
sĕppavaddā buddulu nīsĕluvunigi
vuppadiṁcha keluṁṭive vŏḍivaṭṭam̐gānu
(||||)
viṁduvalĕ nādanise viḍĕmu ne naṁdugom̐gā
saṁduḍi nīvela jaraseve
pŏṁdusesi nīviṁtesi pūnuga vachchedānavu
yĕṁduṁṭive nannadam̐ḍu yelugŏnam̐gānu
(||||)
vŏddanuṁḍi nenādani kūḍigālu seyam̐gānu
gaddiṁchi nīvem̐ṭigim̐ gām̐tāḽiṁcheve
suddule sĕppusu vaṭṭisūḍu vaṭṭedānavu
tiddugovaddaḍave yī tĕravu rām̐gānu
(||||)
gakkana śhrīveṁkaḍeśhugām̐giḍa nem̐ gūḍam̐gānu
vĕkkasāna nemiḍigi vĕragaṁdeve
akkarado nĕḍasŏchchi āyālaṁṭedānavu
mŏkki vem̐ḍugŏnavadā muṁdumuṁdugā