Seppare yeemaada selulaala vibhunigi

చెప్పరే యీమాట చెలులాల విభునికి
Language

(॥పల్లవి॥)
చెప్పరే యీమాట చెలులాల విభునికి
చిప్పిలి నేనైతేను సిగ్గుతో నుందానను

(॥చెప్ప॥)
విరుల వేసినవేటు వేడుకలు వుట్టించె
తొరల నవ్విననవ్వు దొమ్మిసేసెను
మరలిచూచినచూపు మనసెల్లాఁ గరఁగించె
యిరవాయఁ దనవలపెట్టోర్వవచ్చునే

(॥చెప్ప॥)
పెదవిపై సన్నలు ప్రియములు నిండించె
వురుటుజంకెన రతి నుబ్బులు రేఁచె
పొదిగొన్నతమకము పొంచి తమకము నించె
ఇదె తననేరువు లేరీతి మఱతునే

(॥చెప్ప॥)
చేరి తనమైసోఁకులు చెమటలు గారించె
సారెఁ దనపొందులు చవులు వెంచె
కోరి యలమేల్‌మంగకుఁ బతి శ్రీవేంకటేశుఁ-
డీరితి నన్నుఁగూడె నిఁక నేమి సేతునే

(||pallavi||)
sĕppare yīmāḍa sĕlulāla vibhunigi
sippili nenaidenu siggudo nuṁdānanu

(||sĕppa||)
virula vesinaveḍu veḍugalu vuṭṭiṁchĕ
tŏrala navvinanavvu dŏmmisesĕnu
maralisūsinasūbu manasĕllām̐ garam̐giṁchĕ
yiravāyam̐ danavalabĕṭṭorvavachchune

(||sĕppa||)
pĕdavibai sannalu priyamulu niṁḍiṁchĕ
vuruḍujaṁkĕna radi nubbulu rem̐sĕ
pŏdigŏnnadamagamu pŏṁchi tamagamu niṁchĕ
idĕ tananeruvu lerīdi maṟadune

(||sĕppa||)
seri tanamaisom̐kulu sĕmaḍalu gāriṁchĕ
sārĕm̐ danabŏṁdulu savulu vĕṁchĕ
kori yalamel‌maṁgagum̐ badi śhrīveṁkaḍeśhum̐-
ḍīridi nannum̐gūḍĕ nim̐ka nemi sedune