చెప్పరే బుద్దు లాపెకు చెలులాల
(॥పల్లవి॥)
చెప్పరే బుద్దు లాపెకు చెలులాల
వొప్పుగొని గుట్టుతోడ నుండుటే మే లనరే
(॥చెప్ప॥)
వావులు గలయఁజెప్పి వద్ద వచ్చి కూచుండి
నా విభునితో నేల నవ్వీనే తాను
పావురాలఁ బలికించి పాలిండు చూపి మోపి
చేవమీర వలపెంత చిమ్మిరేఁచీనే
(॥చెప్ప॥)
కలువల గొని వేసి కప్పురము పైఁ జల్లి
చెలరేఁగి సన్నలేల సేసీనే తాను
చిలుకల గానుకిచ్చి చేరి యనఁగి పెనఁగి
యెలమిఁ దమకమెంత యేసపెట్టీనే
(॥చెప్ప॥)
చేతులు సారెకుఁ జాఁచి సేవ లెన్నియైనాఁ జేసి
పోతరించ రతికేల పొంచీనే తాను
యీతఁడె శ్రీవేంకటేశుఁ డేలె నన్నుఁ గూడిమాడి
ఆతలఁ దా నందాఁకా నాసలు సేసీనే
(||pallavi||)
sĕppare buddu lābĕgu sĕlulāla
vŏppugŏni guṭṭudoḍa nuṁḍuḍe me lanare
(||sĕppa||)
vāvulu galayam̐jĕppi vadda vachchi kūsuṁḍi
nā vibhunido nela navvīne tānu
pāvurālam̐ baligiṁchi pāliṁḍu sūbi mobi
sevamīra valabĕṁta simmirem̐sīne
(||sĕppa||)
kaluvala gŏni vesi kappuramu paim̐ jalli
sĕlarem̐gi sannalela sesīne tānu
silugala gānugichchi seri yanam̐gi pĕnam̐gi
yĕlamim̐ damagamĕṁta yesabĕṭṭīne
(||sĕppa||)
sedulu sārĕgum̐ jām̐si seva lĕnniyainām̐ jesi
podariṁcha radigela pŏṁchīne tānu
yīdam̐ḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannum̐ gūḍimāḍi
ādalam̐ dā naṁdām̐kā nāsalu sesīne