Sepparaani suddu livi selulaala maa pomdulu

చెప్పరాని సుద్దు లివి చెలులాల మా పొందులు
Language

(॥పల్లవి॥)
చెప్పరాని సుద్దు లివి చెలులాల మా పొందులు
తప్పక సూచించరే తలఁపయ్యీఁ బతికి

(॥చెప్ప॥)
నా మోహము తా నెరుఁగు నమ్మితిఁ దనమాటలు
యేమని విన్నవించేనే ఇంకాఁ దనకు
చేముంచి సేసలు వెట్టె శిరసెల్లా నిండె నాకు
ఆమేలు మఱవఁ దనయానతిలో దాననే

(॥చప్ప॥)
ఇన్నిటా మన్నించెఁ దాను ఇచ్చకురాలను నేను
సన్నల నెంతని తన్ను సాదించేనే
కన్నులఁ దప్పకచూచె కడు సంతోసించుకొంటి
యెన్నికలెల్లా నీడెరె నితవాయ ననరే

(॥చెప్ప॥)
కంకణము దాఁగట్టె కరము చాఁచితి నేను
పొంకమాయఁ బనులెల్లాఁ బొదిగేదేమే
అంకెల శ్రీవేంకటేశుఁ డట్టె తా నన్నేలె నేఁడు
సంకెలెల్లాఁ బాసె నిట్టె చనవు లొసఁగెను

(||pallavi||)
sĕpparāni suddu livi sĕlulāla mā pŏṁdulu
tappaga sūsiṁchare talam̐payyīm̐ badigi

(||sĕppa||)
nā mohamu tā nĕrum̐gu nammidim̐ danamāḍalu
yemani vinnaviṁchene iṁkām̐ danagu
semuṁchi sesalu vĕṭṭĕ śhirasĕllā niṁḍĕ nāgu
āmelu maṟavam̐ danayānadilo dānane

(||sappa||)
inniḍā manniṁchĕm̐ dānu ichchagurālanu nenu
sannala nĕṁtani tannu sādiṁchene
kannulam̐ dappagasūsĕ kaḍu saṁtosiṁchugŏṁṭi
yĕnnigalĕllā nīḍĕrĕ nidavāya nanare

(||sĕppa||)
kaṁkaṇamu dām̐gaṭṭĕ karamu sām̐sidi nenu
pŏṁkamāyam̐ banulĕllām̐ bŏdigedeme
aṁkĕla śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ tā nannelĕ nem̐ḍu
saṁkĕlĕllām̐ bāsĕ niṭṭĕ sanavu lŏsam̐gĕnu