చెప్పరాని ముచ్చటల చిన్నదానవు
(॥పల్లవి॥)
చెప్పరాని ముచ్చటల చిన్నదానవు
ఇప్పుడిట్టె యిందరిలో నేమి నేర్చుకొంటివే
(॥చెప్ప॥)
తగులనాడే యట్టి తరితీపు మాఁటలు
చిగురుఁ బెదవిమీఁది చిరుసిగ్గులు
మొగము చూపులలోని ముప్పిరిగొనే నవ్వులు
ఇగురుఁబోఁడివి నీవు యెక్కడ నేర్చితివే
(॥చెప్ప॥)
పంతపు మాఁటల తోడి పచ్చి పచ్చి చేఁతలు
దొంతులు వేరిచేయట్టిదొరతనాలు
మంతనాన రేఁచేటి మఱఁగుల సొలపులు
యెంతకెంత జవరాల వెట్టు నేర్చకొంటివే
(॥చెప్ప॥)
తనివోని తమకపు తరితీపుఁ జెనకులు
వినయపు టిచ్చగింపు వేడుకలు
ఘనుఁడు శ్రీవేంకటకడపరాయనిఁ గూడి
యెనలేని సరసము లెందు నేర్చుకొంటివే
(||pallavi||)
sĕpparāni muchchaḍala sinnadānavu
ippuḍiṭṭĕ yiṁdarilo nemi nersugŏṁṭive
(||sĕppa||)
tagulanāḍe yaṭṭi taridību mām̐ṭalu
sigurum̐ bĕdavimīm̐di sirusiggulu
mŏgamu sūbulaloni muppirigŏne navvulu
igurum̐bom̐ḍivi nīvu yĕkkaḍa nersidive
(||sĕppa||)
paṁtabu mām̐ṭala toḍi pachchi pachchi sem̐talu
dŏṁtulu veriseyaṭṭidŏradanālu
maṁtanāna rem̐seḍi maṟam̐gula sŏlabulu
yĕṁtagĕṁta javarāla vĕṭṭu nersagŏṁṭive
(||sĕppa||)
tanivoni tamagabu taridībum̐ jĕnagulu
vinayabu ṭichchagiṁpu veḍugalu
ghanum̐ḍu śhrīveṁkaḍagaḍabarāyanim̐ gūḍi
yĕnaleni sarasamu lĕṁdu nersugŏṁṭive