చెప్పరాదు యీతని సింగారాలు
(॥పల్లవి॥)
చెప్పరాదు యీతని సింగారాలు
ముప్పిరిగొని సిరులు ముంచెనోకాని
(॥చెప్ప॥)
అండనే కప్పురకాఁపు లదివో దేవునికి
మొండుకొని అమరెను మేననెల్లాను
పుండరీకాక్షుఁడుగాన పొదలి తెల్లనికాంతి
నిండుకొని నిలువెల్లా నెలసెనోకాని
(॥చెప్ప॥)
తట్టుపుణుఁగుకాఁపు దైవాలరాయనికి
దట్టమై యమరె నిదె తనువెల్లాను
చుట్టు నెమలిపెంచముచుంగులనల్లనికాంతి
అట్టె అంగములనెల్లా నలమెనోకాని
(॥చెప్పు॥)
అలమేలుమంగ వురమందు శ్రీవేంకటేశున
కెలమి నమరె యిదె యీతనువున
మొల పీతాంబరమున మొలచినపైఁడి కాంతి
అలరి మెడను సొమ్ములాయనోకాని
(||pallavi||)
sĕpparādu yīdani siṁgārālu
muppirigŏni sirulu muṁchĕnogāni
(||sĕppa||)
aṁḍane kappuragām̐pu ladivo devunigi
mŏṁḍugŏni amarĕnu menanĕllānu
puṁḍarīgākṣhum̐ḍugāna pŏdali tĕllanigāṁti
niṁḍugŏni niluvĕllā nĕlasĕnogāni
(||sĕppa||)
taṭṭubuṇum̐gugām̐pu daivālarāyanigi
daṭṭamai yamarĕ nidĕ tanuvĕllānu
suṭṭu nĕmalibĕṁchamusuṁgulanallanigāṁti
aṭṭĕ aṁgamulanĕllā nalamĕnogāni
(||sĕppu||)
alamelumaṁga vuramaṁdu śhrīveṁkaḍeśhuna
kĕlami namarĕ yidĕ yīdanuvuna
mŏla pīdāṁbaramuna mŏlasinabaim̐ḍi kāṁti
alari mĕḍanu sŏmmulāyanogāni