చెప్పరాదు చూపరాదు చిత్తగించవయ్యా నీవు
(॥పల్లవి॥)
చెప్పరాదు చూపరాదు చిత్తగించవయ్యా నీవు
ముప్పిరి నింకా నెంత వెూపుగట్టీనో
(॥॥)
కానుకపట్టీఁ జూపులు కలికి నీయెదుటను
వానలుగఁ జెమటలు వడిసీ మేన
నానఁ బెట్టి సెలవులు నవ్వులు నవ్వీ నీతో
పూని మోహ మింకానెంత పోగువోసినో
(॥॥)
వెదవెట్టీ మాటలు వేడుకతో నీ ముందర
గుదిగుచ్చీ సిగ్గులు నీకొలువునను
పొదిగొన్నతమకము పొంచి నీపై దిగఁ బోసీ
యెదుటఁ దనకోరిక లింకానెంత చూపీనో
(॥॥)
విందువెట్టీ మోవితేనె వింతలుగా నిందరిలో
అందిచ్చీ కాఁగిలి నీకు నటు చేతుల
కందున శ్రీవేంకటేశ కైకొని కూడితివి
పొంది రతు లింకానెంత భోగించీనో
(||pallavi||)
sĕpparādu sūbarādu sittagiṁchavayyā nīvu
muppiri niṁkā nĕṁta vĕూpugaṭṭīno
(||||)
kānugabaṭṭīm̐ jūbulu kaligi nīyĕduḍanu
vānalugam̐ jĕmaḍalu vaḍisī mena
nānam̐ bĕṭṭi sĕlavulu navvulu navvī nīdo
pūni moha miṁkānĕṁta poguvosino
(||||)
vĕdavĕṭṭī māḍalu veḍugado nī muṁdara
gudiguchchī siggulu nīgŏluvunanu
pŏdigŏnnadamagamu pŏṁchi nībai digam̐ bosī
yĕduḍam̐ danagoriga liṁkānĕṁta sūbīno
(||||)
viṁduvĕṭṭī movidenĕ viṁtalugā niṁdarilo
aṁdichchī kām̐gili nīgu naḍu sedula
kaṁduna śhrīveṁkaḍeśha kaigŏni kūḍidivi
pŏṁdi radu liṁkānĕṁta bhogiṁchīno