చెప్పరాదు నీవు వలచిన సొంపులు
(॥పల్లవి॥)
చెప్పరాదు నీవు వలచిన సొంపులు
లప్పలై రాలె గందము లగ్గదింపులు
(॥చెప్ప॥)
కలికి నీపైఁ జల్లీ కనుచూపులు
తలపోయ నీకవి తరితీపులు
తొలఁకించీఁ జన్నులను తోదోపులను
మలసితే ముకొనీ మరుతూపూలు
(॥చెప్ప॥)
చెంది సెలవులఁ జిమ్మీ చిఱునవ్వులు
యిందరిలో నీకు నవి యెడదవ్వులు
కందున నీతో సిగ్గులు కమ్మ బువ్వులు
దిందుపడ్డ యీపెకొప్పు తేఁటికొవ్వులు
(॥చెప్ప॥)
కెరలి చేకొనీ నీ కాఁగిటిపొందులు
మరుగకు నీకు నవి మాటుమందులు
మురిపేనఁ గూడి యిచ్చె మోవివిందులు
యిరవై శ్రీవేంకటేశ యిదె సందులు
(||pallavi||)
sĕpparādu nīvu valasina sŏṁpulu
lappalai rālĕ gaṁdamu laggadiṁpulu
(||sĕppa||)
kaligi nībaim̐ jallī kanusūbulu
talaboya nīgavi taridībulu
tŏlam̐kiṁchīm̐ jannulanu todobulanu
malaside mugŏnī marudūbūlu
(||sĕppa||)
sĕṁdi sĕlavulam̐ jimmī siṟunavvulu
yiṁdarilo nīgu navi yĕḍadavvulu
kaṁduna nīdo siggulu kamma buvvulu
diṁdubaḍḍa yībĕgŏppu tem̐ṭigŏvvulu
(||sĕppa||)
kĕrali segŏnī nī kām̐giḍibŏṁdulu
marugagu nīgu navi māḍumaṁdulu
muribenam̐ gūḍi yichchĕ moviviṁdulu
yiravai śhrīveṁkaḍeśha yidĕ saṁdulu