Sepparaadu nee paraagu jigi mimche valabulu

చెప్పరాదు నీ పరాకు జిగి మించె వలపులు
Language

(॥పల్లవి॥)
చెప్పరాదు నీ పరాకు జిగి మించె వలపులు
యెప్పుడు వచ్చీని యీడేరించీ నన్నును

(॥చెప్ప॥)
తలఁచునొకొ నేఁడు తానాతో నాడినమాట
పిలువక వచ్చునొకొ ప్రియుఁడీడకు
నిలుచునొకొ యిట్టె నెమ్మది నాయెదుటను
చెలియా నాకోరికలు చిమ్మిఁరేచీ నన్నును

(॥చెప్ప॥)
కందునొకొ వొకపరి గక్కననుఁ దనరూపు
విందునొకొ తనమాట వీనులారాను
అందునొకొ తనతోను ఆడుకోలుమాటలెల్లా
సందడించీఁ దమకము సారెకు నాలోనను

(॥చెప్ప॥)
గారవించునొకొ నన్ను కాఁగిలించికాఁగిలించి
సారెకు మోవిచ్చునొకొ చవులుగాను
యీరీతి నలమేల్‌మంగ నేను శ్రీవేంకటేశుఁడు
చేరి తానేవచ్చీ గూడె చెంగలించీ మనసు

(||pallavi||)
sĕpparādu nī parāgu jigi miṁchĕ valabulu
yĕppuḍu vachchīni yīḍeriṁchī nannunu

(||sĕppa||)
talam̐sunŏgŏ nem̐ḍu tānādo nāḍinamāḍa
piluvaga vachchunŏgŏ priyum̐ḍīḍagu
nilusunŏgŏ yiṭṭĕ nĕmmadi nāyĕduḍanu
sĕliyā nāgorigalu simmim̐resī nannunu

(||sĕppa||)
kaṁdunŏgŏ vŏgabari gakkananum̐ danarūbu
viṁdunŏgŏ tanamāḍa vīnulārānu
aṁdunŏgŏ tanadonu āḍugolumāḍalĕllā
saṁdaḍiṁchīm̐ damagamu sārĕgu nālonanu

(||sĕppa||)
gāraviṁchunŏgŏ nannu kām̐giliṁchigām̐giliṁchi
sārĕgu movichchunŏgŏ savulugānu
yīrīdi nalamel‌maṁga nenu śhrīveṁkaḍeśhum̐ḍu
seri tānevachchī gūḍĕ sĕṁgaliṁchī manasu