చెప్పఁగల మాఁటలెల్లాఁ జెప్పితి నీకు
(॥పల్లవి॥)
చెప్పఁగల మాఁటలెల్లాఁ జెప్పితి నీకు
మెప్పించి నన్నేలితివి మేలుదానఁ జుమ్మీ
(॥చెప్పఁ॥)
చలపట్టి వేఁగినంతా సరసములే యాడేవు
వలవని జాగరాలు వద్దు వద్దయ్యా
తలకొని నామేన గందము వూసే వప్పటిని
వులివచ్చి వలపులు వుప్పతిలీఁ జుమ్మీ
(॥చెప్పఁ॥)
పిప్పి గట్ట మాపుదాఁకా పెనఁగి పొద్దువుచ్చేవు
చప్పని చెలిమి చాలుఁ జూలునయ్యా
ముప్పిరిఁ బన్నీరు నాపై ముంచి ముంచి చల్లేవు
చిప్పిలు నాజవ్వనము చిగిరించీఁ జుమ్మీ
(॥చెప్పఁ॥)
పొద్దు వొద్దు తప్పకుండా పొంచి కాఁగిలించేవు
అద్దో యెతనేరుపరి వౌనౌనయ్యా
కొద్దితో శ్రీవేంకటేశ కూడి కప్రాన వేసేవు
వొద్దికై నాకళలంటి వువ్విళ్లూరీఁ జుమ్వీ
(||pallavi||)
sĕppam̐gala mām̐ṭalĕllām̐ jĕppidi nīgu
mĕppiṁchi nannelidivi meludānam̐ jummī
(||sĕppam̐||)
salabaṭṭi vem̐ginaṁtā sarasamule yāḍevu
valavani jāgarālu vaddu vaddayyā
talagŏni nāmena gaṁdamu vūse vappaḍini
vulivachchi valabulu vuppadilīm̐ jummī
(||sĕppam̐||)
pippi gaṭṭa mābudām̐kā pĕnam̐gi pŏdduvuchchevu
sappani sĕlimi sālum̐ jūlunayyā
muppirim̐ bannīru nābai muṁchi muṁchi sallevu
sippilu nājavvanamu sigiriṁchīm̐ jummī
(||sĕppam̐||)
pŏddu vŏddu tappaguṁḍā pŏṁchi kām̐giliṁchevu
addo yĕdanerubari vaunaunayyā
kŏddido śhrīveṁkaḍeśha kūḍi kaprāna vesevu
vŏddigai nāgaḽalaṁṭi vuvviḽlūrīm̐ jumvī