Seppamgade mee suddulu sevulaara vinemu

చెప్పఁగదె మీ సుద్దులు చెవులార వినేము
Language

(॥పల్లవి॥)
చెప్పఁగదె మీ సుద్దులు చెవులార వినేము
తప్పక వలపులెల్లా తారుకాణ వచ్చెనా

(॥చెప్ప॥)
వేఁగినంతా నేకతాలు విభునితో నాడితివి
చేఁగదేర విడేలు సేసితివి
యీగతిఁ జుట్టరికా లిద్దరికిఁ గలసెనా
భోగపురతులకెల్లా పొంతనాలు గూడెనా

(॥చెప్ప॥)
యెదురుబడి నుండి యింపులుగా నవ్వితివి
మొదలఁ జూచుకొంటిరి మొకమొకాలు
సదరాన మీలో మీకు సగినాలు లెస్సాయనా
మదనతంత్రముల మీమనసు లెనసెనా

(॥చెప్ప॥)
గక్కనఁ శ్రీవేంకటేశుఁ గాఁగిలించుకొంటివి
చిక్కించుక సేవలెల్లాఁ జేసితివి
యిక్కువ నీతఁడె నన్ను యిచ్చగించి రతిఁగూడె
చొక్కపు మీపెండ్లికి సోబానఁ బాడిరా

(||pallavi||)
sĕppam̐gadĕ mī suddulu sĕvulāra vinemu
tappaga valabulĕllā tārugāṇa vachchĕnā

(||sĕppa||)
vem̐ginaṁtā negadālu vibhunido nāḍidivi
sem̐gadera viḍelu sesidivi
yīgadim̐ juṭṭarigā liddarigim̐ galasĕnā
bhogaburadulagĕllā pŏṁtanālu gūḍĕnā

(||sĕppa||)
yĕdurubaḍi nuṁḍi yiṁpulugā navvidivi
mŏdalam̐ jūsugŏṁṭiri mŏgamŏgālu
sadarāna mīlo mīgu saginālu lĕssāyanā
madanadaṁtramula mīmanasu lĕnasĕnā

(||sĕppa||)
gakkanam̐ śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁchugŏṁṭivi
sikkiṁchuga sevalĕllām̐ jesidivi
yikkuva nīdam̐ḍĕ nannu yichchagiṁchi radim̐gūḍĕ
sŏkkabu mībĕṁḍligi sobānam̐ bāḍirā