Seppamgadave seliya viniyeda sevulu sallamga nadani suddulu

చెప్పఁగదవె చెలియ వినియెద చెవులు చల్లఁగ నతని సుద్దులు
Language

(॥పల్లవి॥)
చెప్పఁగదవె చెలియ వినియెద చెవులు చల్లఁగ నతని సుద్దులు
కుప్పలుఁ దెప్పలు గాఁగఁ గూడిన గురుతులెల్లనుఁ దలఁచునా

(॥చెప్పఁ॥)
తనకు నాకును తొల్లటి మాఁటల తారుకాణలు దలఁచునా
చెనకి చెనకి మర్మములంటఁగ సిగ్గులు వడుట దలఁచునా
చనవుతోడుత నడ్డాఁకలేక సరసమాడుట దలఁచునా
దినదినమును మోములు చూచుక తెప్పలఁదేలుట తలఁచునా

(॥చెప్పఁ॥)
పానుపుమీఁదట మిద్దర మొక్కటై పాయకవుండేది దలఁచునా
ఆనలు మీరుచు సరకిబేసికి ఆయము లంటుట దలఁచునా
మేనులఁ జెమట లుప్పతిల్లఁగ మించిపెనఁగుట దలఁచునా
తానకమయినబోగములను దైలువారుట దలఁచునా

(॥చప్పఁ॥)
యెప్పుడుఁ దానును నేనును నెనసి యెరవులేనిది దలఁచునా
చొప్పుకఁ గలసిమెలసివుండేటి చుట్టరికములు దలఁచునా
తప్పక ... నా ఇంటికి విచ్చేసి తానే నన్ను మన్నంచి ఏలెను
ఇప్పటివలెనే శ్రీవేంకటేశుఁడు యింతటానన్నుఁ దలఁచునా

(||pallavi||)
sĕppam̐gadavĕ sĕliya viniyĕda sĕvulu sallam̐ga nadani suddulu
kuppalum̐ dĕppalu gām̐gam̐ gūḍina gurudulĕllanum̐ dalam̐sunā

(||sĕppam̐||)
tanagu nāgunu tŏllaḍi mām̐ṭala tārugāṇalu dalam̐sunā
sĕnagi sĕnagi marmamulaṁṭam̐ga siggulu vaḍuḍa dalam̐sunā
sanavudoḍuda naḍḍām̐kalega sarasamāḍuḍa dalam̐sunā
dinadinamunu momulu sūsuga tĕppalam̐deluḍa talam̐sunā

(||sĕppam̐||)
pānubumīm̐daḍa middara mŏkkaḍai pāyagavuṁḍedi dalam̐sunā
ānalu mīrusu saragibesigi āyamu laṁṭuḍa dalam̐sunā
menulam̐ jĕmaḍa luppadillam̐ga miṁchibĕnam̐guḍa dalam̐sunā
tānagamayinabogamulanu dailuvāruḍa dalam̐sunā

(||sappam̐||)
yĕppuḍum̐ dānunu nenunu nĕnasi yĕravulenidi dalam̐sunā
sŏppugam̐ galasimĕlasivuṁḍeḍi suṭṭarigamulu dalam̐sunā
tappaga ... nā iṁṭigi vichchesi tāne nannu mannaṁchi elĕnu
ippaḍivalĕne śhrīveṁkaḍeśhum̐ḍu yiṁtaḍānannum̐ dalam̐sunā