చెప్పఁగ నేఁటికి సేసినమే లిఁక
(॥పల్లవి॥)
చెప్పఁగ నేఁటికి సేసినమే లిఁక
చొప్పుగ నీవే చూచుకొనేవు
(॥చెప్పఁ॥)
కన్నియ మాఁటల కసరఁగనోపక
సన్నటనే నిను జరసీని
అన్నిట ప్రౌఢవయసుదయితేఁగన
మొన్నటిసేఁతకు మొగమోడీనా
(॥చెప్ప॥)
బాలకి నీతో పంతము నెఱపక
వాడిక చూపుల వడి సొలసీ
యీలాగున నీయీడుదియైతే
నాలితనమున వెనకతీసీనా
(॥చెప్ప॥)
జవ్వని బొమ్మల జంకించనోపక
యివ్వల నిన్నిపు డెనసె నిదే
చివ్వన వింతది శ్రీవేంకటేశ్వర
రవ్వలు సేయక రతిఁ గోఁకీనా
(||pallavi||)
sĕppam̐ga nem̐ṭigi sesiname lim̐ka
sŏppuga nīve sūsugŏnevu
(||sĕppam̐||)
kanniya mām̐ṭala kasaram̐ganobaga
sannaḍane ninu jarasīni
anniḍa prauḍhavayasudayidem̐gana
mŏnnaḍisem̐tagu mŏgamoḍīnā
(||sĕppa||)
bālagi nīdo paṁtamu nĕṟabaga
vāḍiga sūbula vaḍi sŏlasī
yīlāguna nīyīḍudiyaide
nālidanamuna vĕnagadīsīnā
(||sĕppa||)
javvani bŏmmala jaṁkiṁchanobaga
yivvala ninnibu ḍĕnasĕ nide
sivvana viṁtadi śhrīveṁkaḍeśhvara
ravvalu seyaga radim̐ gom̐kīnā