చెప్పఁ జెప్పఁ గొత్తలాయ చెలియ నీ సొబగులు
(॥పల్లవి॥)
చెప్పఁ జెప్పఁ గొత్తలాయ చెలియ నీ సొబగులు
కుప్పులుఁ దెప్పలునై గురుతులు మీరెనే
(॥చెప్పఁ॥)
కన్నులపండుగ గదే కలికి నీరూపము
జన్నె పాఁడిగదే నీచక్కని మోవి
వెన్న(న్నె?)ల తేటలుగదే వేడుక నీనవ్వులు
వన్నెగా నిన్నుఁ బొందినవాఁడే భాగ్యవంతుఁడే
(॥చెప్పఁ॥)
ముంగిట ముగ్గులు గదే ముదిత నీ సింగారము
తంగేటి జున్ను గదే దంట మాఁటలు
కొంగుఁ బాలు గదవె పూఁటవూఁట నీసిగ్గులు
అంగన నిన్నేలేవాఁడు అతిభాగ్యవంతుఁడే
(॥చెప్పఁ॥)
పెట్టెలో సొమ్ము గదవే ప్రియరాలు నీవయసు
కట్టిన ముడుపుగదే కాఁగిటి రతి
యిట్టె శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్ను నేలె
దట్టమై నీపాలివాఁ డితఁడే భాగ్యవంతుఁడే
(||pallavi||)
sĕppam̐ jĕppam̐ gŏttalāya sĕliya nī sŏbagulu
kuppulum̐ dĕppalunai gurudulu mīrĕne
(||sĕppam̐||)
kannulabaṁḍuga gade kaligi nīrūbamu
jannĕ pām̐ḍigade nīsakkani movi
vĕnna(nnĕ?)la teḍalugade veḍuga nīnavvulu
vannĕgā ninnum̐ bŏṁdinavām̐ḍe bhāgyavaṁtum̐ḍe
(||sĕppam̐||)
muṁgiḍa muggulu gade mudida nī siṁgāramu
taṁgeḍi junnu gade daṁṭa mām̐ṭalu
kŏṁgum̐ bālu gadavĕ pūm̐ṭavūm̐ṭa nīsiggulu
aṁgana ninnelevām̐ḍu adibhāgyavaṁtum̐ḍe
(||sĕppam̐||)
pĕṭṭĕlo sŏmmu gadave priyarālu nīvayasu
kaṭṭina muḍubugade kām̐giḍi radi
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnu nelĕ
daṭṭamai nībālivām̐ ḍidam̐ḍe bhāgyavaṁtum̐ḍe