చెప్పఁ గొత్తలాయ నీ చేసేటి కాఁపురము
(॥పల్లవి॥)
చెప్పఁ గొత్తలాయ నీ చేసేటి కాఁపురము
దప్పిదేరే మోవితోడ తలవంచకువే
(॥చెప్ప॥)
కొడిమెలెన్నుచు నిన్నుఁ గోపగించి నంటాను
పడఁతికేల లోఁగేవు పంతగాఁడవు
అడరి నీ మర్మమెల్లా నాపెచేత నున్నదా
జడిశాపె దిక్కే నీవు సారెకుఁ జూచేవు
(॥చెప్ప॥)
యీవలా నావలా యేతువలెత్తినంటా
దేవులకేల కొంకేవు దిట్టవాఁడవు
భావించ నింత నీపాలిటి దేవరాయనా
కావరించి మాట కతి కడవఁగఁజాలవు
(॥చెప్ప॥)
దంటతనమున నిన్ను దప్పులెంచీనంటాను
ఇంటియాపెకేల వీఁగే వింతవాఁడవు
నంటున శ్రీవేంకటేశ నన్ను నేలితివి నేఁడు
అంటిముట్టి యాపెనే అప్పణడిగేవు
(||pallavi||)
sĕppam̐ gŏttalāya nī seseḍi kām̐puramu
dappidere movidoḍa talavaṁchaguve
(||sĕppa||)
kŏḍimĕlĕnnusu ninnum̐ gobagiṁchi naṁṭānu
paḍam̐tigela lom̐gevu paṁtagām̐ḍavu
aḍari nī marmamĕllā nābĕseda nunnadā
jaḍiśhābĕ dikke nīvu sārĕgum̐ jūsevu
(||sĕppa||)
yīvalā nāvalā yeduvalĕttinaṁṭā
devulagela kŏṁkevu diṭṭavām̐ḍavu
bhāviṁcha niṁta nībāliḍi devarāyanā
kāvariṁchi māḍa kadi kaḍavam̐gam̐jālavu
(||sĕppa||)
daṁṭadanamuna ninnu dappulĕṁchīnaṁṭānu
iṁṭiyābĕgela vīm̐ge viṁtavām̐ḍavu
naṁṭuna śhrīveṁkaḍeśha nannu nelidivi nem̐ḍu
aṁṭimuṭṭi yābĕne appaṇaḍigevu