చేఁత యెన్నేసి సేసీని చిన్నది తాను
(॥పల్లవి॥)
చేఁత యెన్నేసి సేసీని చిన్నది తాను
లేఁత నవ్వులనే పొదలించీ వలపులు
(॥చేఁత॥)
పొలఁతి కెవ్వరు తొల్లి బుద్దులు చెప్పిరోకాని
సొలసిసొలసి నిన్నుఁజూచీని
కలికి తనాలు యెంతగా నేరిచెనోకాని
చెలరేఁగి నీమీఁదఁ జేతులు చాఁచీని
(॥చేఁత॥)
వినయాలెల్లా నీపెకు వెన్నతోఁబెట్టిరోకాని
గనముగా సారెసారెఁ గడు మొక్కీని
మనసులో నెటువంటి మర్మము గనెనోకాని
కొన చన్నుల నొరసి కూరిమి గొసరీని
(॥చేఁత॥)
గుట్టు తనలో నెంత కూడపోసెనోకాని
నెట్టుకొన్న సిగ్గుతోడ నిండుకున్నది
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చుట్టమై తా నిన్నుఁ గూడి సుద్దులు చెప్పీని
(||pallavi||)
sem̐ta yĕnnesi sesīni sinnadi tānu
lem̐ta navvulane pŏdaliṁchī valabulu
(||sem̐ta||)
pŏlam̐ti kĕvvaru tŏlli buddulu sĕppirogāni
sŏlasisŏlasi ninnum̐jūsīni
kaligi tanālu yĕṁtagā nerisĕnogāni
sĕlarem̐gi nīmīm̐dam̐ jedulu sām̐sīni
(||sem̐ta||)
vinayālĕllā nībĕgu vĕnnadom̐bĕṭṭirogāni
ganamugā sārĕsārĕm̐ gaḍu mŏkkīni
manasulo nĕḍuvaṁṭi marmamu ganĕnogāni
kŏna sannula nŏrasi kūrimi gŏsarīni
(||sem̐ta||)
guṭṭu tanalo nĕṁta kūḍabosĕnogāni
nĕṭṭugŏnna siggudoḍa niṁḍugunnadi
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
suṭṭamai tā ninnum̐ gūḍi suddulu sĕppīni