Semadalu gaaramgaanu selamgi yemkarugomtaa

చెమటలు గారఁగాను చెలఁగి యేఁకరుకొంటా
Language

(॥పల్లవి॥)
చెమటలు గారఁగాను చెలఁగి యేఁకరుకొంటా
కొమరెలందరు నెంత గుంపుగూడేరే

(॥చెమ॥)
చేరఁడేసికన్నుల చెలిమి కత్తియలాల
మూరఁడేసి కొప్పుల ముగుదలాల
నారమణుఁ డేకతాన నన్ను సింగారించఁగాను
యీరీతి నిందరు వచ్చి యేమిచూచేరే

(॥చెమ॥)
పట్టెఁడేసి చన్నులపాయపు గుబ్బెతలాల
జుట్టెఁ డేసియడుగుల సుదతులాల
చుట్టాలమై యిద్దరము సుద్దులు చెప్పుకోఁగాను
వెట్టికిఁ బొంచి మీరేల వినవచ్చేరే

(॥చెమ॥)
చేటఁడేసిసోమ్ములసింగార వతులాల
మూటెఁడేసి వలపుల మోహినులాల
యీటున శ్రీవేంకటేశుఁ డేలె నలమేల్‌మంగను
మాటికిమాటికి నెంత మమ్ము మెచ్చేరే

(||pallavi||)
sĕmaḍalu gāram̐gānu sĕlam̐gi yem̐karugŏṁṭā
kŏmarĕlaṁdaru nĕṁta guṁpugūḍere

(||sĕma||)
seram̐ḍesigannula sĕlimi kattiyalāla
mūram̐ḍesi kŏppula mugudalāla
nāramaṇum̐ ḍegadāna nannu siṁgāriṁcham̐gānu
yīrīdi niṁdaru vachchi yemisūsere

(||sĕma||)
paṭṭĕm̐ḍesi sannulabāyabu gubbĕdalāla
juṭṭĕm̐ ḍesiyaḍugula sudadulāla
suṭṭālamai yiddaramu suddulu sĕppugom̐gānu
vĕṭṭigim̐ bŏṁchi mīrela vinavachchere

(||sĕma||)
seḍam̐ḍesisommulasiṁgāra vadulāla
mūḍĕm̐ḍesi valabula mohinulāla
yīḍuna śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nalamel‌maṁganu
māḍigimāḍigi nĕṁta mammu mĕchchere