చెలువుఁడు చేసినట్టె సేయరాదా
(॥పల్లవి॥)
చెలువుఁడు చేసినట్టె సేయరాదా
సొలతురా నయములే చూపుదురు గాక
(॥చెలు॥)
సరసమాతఁ డాడఁగా సణఁగు రాలుతురటె
వరుసతో నిచ్చగించవలెఁ గాక
శిరసెత్తి మాటాడఁగా సిగ్గులు వడుదురటె
సరగ మోహములు రేఁచఁగవలెఁగాక
(॥చెలు॥)
చెక్కులాతఁడు నొక్కఁగా సెలసి జంకింతురటే
వక్కణతోఁ గడుమెచ్చవలెఁగాక
దక్కి చేయిచాఁచగాను తప్పించుకోఁదగునటే
యెక్కువ నీమోవితేనే వియ్యవలెఁగాక
(॥చెలు॥)
కళ లాతఁ డంటఁగాను కాఁగిట మలతురటే
యలసినట్లాఁ గూడవలెఁగాక
యెలమి శ్రీవేంకటేశుఁ డేలె నలయింతురటే
కెలపు రతులను చొక్కించవలెఁగాక
(||pallavi||)
sĕluvum̐ḍu sesinaṭṭĕ seyarādā
sŏladurā nayamule sūbuduru gāga
(||sĕlu||)
sarasamādam̐ ḍāḍam̐gā saṇam̐gu rāluduraḍĕ
varusado nichchagiṁchavalĕm̐ gāga
śhirasĕtti māḍāḍam̐gā siggulu vaḍuduraḍĕ
saraga mohamulu rem̐sam̐gavalĕm̐gāga
(||sĕlu||)
sĕkkulādam̐ḍu nŏkkam̐gā sĕlasi jaṁkiṁturaḍe
vakkaṇadom̐ gaḍumĕchchavalĕm̐gāga
dakki seyisām̐sagānu tappiṁchugom̐dagunaḍe
yĕkkuva nīmovidene viyyavalĕm̐gāga
(||sĕlu||)
kaḽa lādam̐ ḍaṁṭam̐gānu kām̐giḍa maladuraḍe
yalasinaṭlām̐ gūḍavalĕm̐gāga
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nalayiṁturaḍe
kĕlabu radulanu sŏkkiṁchavalĕm̐gāga