చెలువుఁడవిదె నీ చిత్తము కొలఁ దిఁక
(॥పల్లవి॥)
చెలువుఁడవిదె నీ చిత్తము కొలఁ దిఁక
వలచిన సతి నటు వదలేనా
(॥చెలు॥)
యేరీతి నీవివు డెరవుగ నడచిన
కూరిమి నే నిఁకఁ గొసరేనా
పొరచికాంతలపొందుల బొంకిన-
తారుకొణలకుఁ దగిలేనా
(॥చెలు॥)
పాదగునీమై పచ్చిగ నడచిన
వాదులకును నే వచ్చేనా
యేదెసనుండైన యీపొద్దు వచ్చిన
కాదు గూడదని కసరేనా
(॥చెలు॥)
యెంగిలియేనితో యిటు నన్నుఁ గూడిన
అంగములంటక అలిగేనా
చెంగటఁ జోక్కితి శ్రీవేంకటేశ్వర
వెంగలినీరతికి వెఱచేనా
(||pallavi||)
sĕluvum̐ḍavidĕ nī sittamu kŏlam̐ dim̐ka
valasina sadi naḍu vadalenā
(||sĕlu||)
yerīdi nīvivu ḍĕravuga naḍasina
kūrimi ne nim̐kam̐ gŏsarenā
pŏrasigāṁtalabŏṁdula bŏṁkina-
tārugŏṇalagum̐ dagilenā
(||sĕlu||)
pādagunīmai pachchiga naḍasina
vādulagunu ne vachchenā
yedĕsanuṁḍaina yībŏddu vachchina
kādu gūḍadani kasarenā
(||sĕlu||)
yĕṁgiliyenido yiḍu nannum̐ gūḍina
aṁgamulaṁṭaga aligenā
sĕṁgaḍam̐ jokkidi śhrīveṁkaḍeśhvara
vĕṁgalinīradigi vĕṟasenā