చెలువుఁడ యీకెనుఁ జిత్తగించుమిఁక
(॥పల్లవి॥)
చెలువుఁడ యీకెనుఁ జిత్తగించుమిఁక
వెలసి నీకు నివి వేడుకలాయ
(॥చెలు॥)
తలఁచక తలఁచిన తరుణిరాక యిది
యిల నీకోరిక కిరవాయ
మొలవక మొలచిన ముసిముసి నవ్వులు
నెలకొని వలపుల నిలుకడలాయ
(॥చెలు॥)
చూడక చూచిన సొలపుల చూపులు
వీడని యాసకుఁ దోడాయ
కూడక కూడిన కుచములసోఁకులు
తోడనే రతులకు దోమటులాయ
(॥చెలు॥)
పెనఁగక పెనఁగినప్రియముల కాఁగిలి
తనివోనితమికిఁ దగులాయ
యెనసిన శ్రీవేంకటేశ యీమగువ
అనిశము నీకును హారంబాయ
(||pallavi||)
sĕluvum̐ḍa yīgĕnum̐ jittagiṁchumim̐ka
vĕlasi nīgu nivi veḍugalāya
(||sĕlu||)
talam̐saga talam̐sina taruṇirāga yidi
yila nīgoriga kiravāya
mŏlavaga mŏlasina musimusi navvulu
nĕlagŏni valabula nilugaḍalāya
(||sĕlu||)
sūḍaga sūsina sŏlabula sūbulu
vīḍani yāsagum̐ doḍāya
kūḍaga kūḍina kusamulasom̐kulu
toḍane radulagu domaḍulāya
(||sĕlu||)
pĕnam̐gaga pĕnam̐ginapriyamula kām̐gili
tanivonidamigim̐ dagulāya
yĕnasina śhrīveṁkaḍeśha yīmaguva
aniśhamu nīgunu hāraṁbāya