చెలులిందరుఁ జూడఁగా సిగ్గువడ వించుకంతా
(॥పల్లవి॥)
చెలులిందరుఁ జూడఁగా సిగ్గువడ వించుకంతా
కలికితనాల నెంత గయ్యాళించేవే
(॥చెలు॥)
మాటలాడనేర్తునంటా మగనితో సారెసారె
తాటించి యంతేసికతలు చెప్పేవే
సూటిదప్పకుండాను సొలసి యట్టె యతని
కాటుకకన్నులఁ జూచి కరఁగించేవే
(॥చెలు॥)
సాముసేయనంటా జమళి నీతనితోను
ఆముక యం(యెం) త పెనఁగులాడేవే నీవు
గామిడితన మునఁ బక్కన నవ్వి యాతనికి
మోముచూసి యెంతేసి దిమ్ములు రేఁచేవే
(॥చెలు॥)
తానాలు నేరుతునంటా తగిలి యాతనిఁ బాడి
పూని చేఁతలెల్లా నెంత పోగువోసేవే
యేనలమేలుమంగను యేలె శ్రీవేంకటేశుఁడు
ఆనించి నీవింకా నెంత ఆసలఁబెట్టేవే
(||pallavi||)
sĕluliṁdarum̐ jūḍam̐gā sigguvaḍa viṁchugaṁtā
kaligidanāla nĕṁta gayyāḽiṁcheve
(||sĕlu||)
māḍalāḍanerdunaṁṭā maganido sārĕsārĕ
tāḍiṁchi yaṁtesigadalu sĕppeve
sūḍidappaguṁḍānu sŏlasi yaṭṭĕ yadani
kāḍugagannulam̐ jūsi karam̐giṁcheve
(||sĕlu||)
sāmuseyanaṁṭā jamaḽi nīdanidonu
āmuga yaṁ(yĕṁ) ta pĕnam̐gulāḍeve nīvu
gāmiḍidana munam̐ bakkana navvi yādanigi
momusūsi yĕṁtesi dimmulu rem̐seve
(||sĕlu||)
tānālu nerudunaṁṭā tagili yādanim̐ bāḍi
pūni sem̐talĕllā nĕṁta poguvoseve
yenalamelumaṁganu yelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
āniṁchi nīviṁkā nĕṁta āsalam̐bĕṭṭeve