చెలులము నిన్నేమి సేయఁగలము
(॥పల్లవి॥)
చెలులము నిన్నేమి సేయఁగలము
నెలఁత భాగ్యములెల్లా నీవల్ల నున్నవి
(॥చెలు॥)
యిందుముఖితో సరసమెంత మీరి యాడినాను
అందుకు ని న్నౌఁగాదని ఆడవచ్చునా
మందలించి వలపులు మట్టు పెట్ట వసగాదు
యెందును యీపెకాఁపుర మిదె నీచే నున్నది
(॥చెలు॥)
వనితను నీ వెట్టు వడి నెలఇంచినాను
పెనఁగి చాయలకు రప్పించఁగలమా
మనసులో తమకము మానుపఁగ నెట్టువచ్చు
వినయాన యీపెమొక్కు వెస నీపై నున్నది
(॥చెలు॥)
సతిఁ గాఁగిటఁ గూడితి సరవు లేమడిగినా
రతులనేరుపు లేర్పరచఁగలమా
తతితో శ్రీవేంకటేశ తగులు మానుపరాదు
సతమై యీపెకోర్కి నీచనవున నున్నది
(||pallavi||)
sĕlulamu ninnemi seyam̐galamu
nĕlam̐ta bhāgyamulĕllā nīvalla nunnavi
(||sĕlu||)
yiṁdumukhido sarasamĕṁta mīri yāḍinānu
aṁdugu ni nnaum̐gādani āḍavachchunā
maṁdaliṁchi valabulu maṭṭu pĕṭṭa vasagādu
yĕṁdunu yībĕgām̐pura midĕ nīse nunnadi
(||sĕlu||)
vanidanu nī vĕṭṭu vaḍi nĕla̮iṁchinānu
pĕnam̐gi sāyalagu rappiṁcham̐galamā
manasulo tamagamu mānubam̐ga nĕṭṭuvachchu
vinayāna yībĕmŏkku vĕsa nībai nunnadi
(||sĕlu||)
sadim̐ gām̐giḍam̐ gūḍidi saravu lemaḍiginā
radulanerubu lerbarasam̐galamā
tadido śhrīveṁkaḍeśha tagulu mānubarādu
sadamai yībĕgorgi nīsanavuna nunnadi