Selulagum dagumgaaga salamu neegum dagunaa

చెలులకుఁ దగుఁగాక చలము నీకుఁ దగునా
Language

(॥పల్లవి॥)
చెలులకుఁ దగుఁగాక చలము నీకుఁ దగునా
పెలుచుఁదనాన నేల పెనఁగేవు నీవు

(॥చెలు॥)
చనపుసేసుకొని సతి నిననుఁ దిట్టితేను
పనిని ఆపెతోనేల పంతాలాడేవు
మనసు రంజిల్ల ఏపై మరి చేయివేసితేను
కినిసి యేల జంకించేవు నీవు

(॥చెలు॥)
నగవుసేసుకొని వలినాక్షి గోరంటితే
తగవులఁబెట్టేవేల తరుణులతో
మొగమోటతో నీమోవి గంటివేసితేను
చిగురుఁబాదమునఁ జిమ్మేవు నీవు

(॥చెలు॥)
గుట్టుసేసుకొని గొప్ప కుచముల నదిమితే
అట్టె యందుకు రతి వలయించేవు
యిట్టె శ్రీవేంకటేశ యెనసి రా కొట్టితేను
దట్టముగ నోరినిండాఁ దమ్ముల మిడేవు

(||pallavi||)
sĕlulagum̐ dagum̐gāga salamu nīgum̐ dagunā
pĕlusum̐danāna nela pĕnam̐gevu nīvu

(||sĕlu||)
sanabusesugŏni sadi ninanum̐ diṭṭidenu
panini ābĕdonela paṁtālāḍevu
manasu raṁjilla ebai mari seyivesidenu
kinisi yela jaṁkiṁchevu nīvu

(||sĕlu||)
nagavusesugŏni valinākṣhi goraṁṭide
tagavulam̐bĕṭṭevela taruṇulado
mŏgamoḍado nīmovi gaṁṭivesidenu
sigurum̐bādamunam̐ jimmevu nīvu

(||sĕlu||)
guṭṭusesugŏni gŏppa kusamula nadimide
aṭṭĕ yaṁdugu radi valayiṁchevu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasi rā kŏṭṭidenu
daṭṭamuga noriniṁḍām̐ dammula miḍevu