చెలులాల యేమి సేతుఁ జెప్పఁగదరె
(॥పల్లవి॥)
చెలులాల యేమి సేతుఁ జెప్పఁగదరె
తలపోఁతలే చిత్తము తడఁబరచీని
(॥॥)
మాటాడునొకో పతి మనసిచ్చి నొకపరి
యీటునఁ జేతికి విడె మిచ్చునొకో
గాఁటపు నాచన్ను లంటి కందువఁ జెనకునొకో
వాటపు నాకోరికలు వలలఁ బెట్టీనే
(॥॥)
తప్పకచూచునొకో తతిగొని రమణుఁడు
కప్పురము నోరికిచ్చి కలసునొకో
దప్పిదేర నవ్వు నవ్వి దండకు వచ్చునొకో
చిప్పిలుఁ దమకములు చిమ్మిరేఁచీనే
(॥॥)
చెలఁగి మోవిచ్చునొకో శ్రీ వేంకటేశ్వరుఁడు
అలమేల్మంగనైన నన్నలము నొకో
కలపుకోలుగ నుఁడి కతలు చెప్పునొకో
నలి నింతలోనె విచ్చేసి నన్నుఁదానె కూడెనే
(||pallavi||)
sĕlulāla yemi sedum̐ jĕppam̐gadarĕ
talabom̐tale sittamu taḍam̐barasīni
(||||)
māḍāḍunŏgo padi manasichchi nŏgabari
yīḍunam̐ jedigi viḍĕ michchunŏgo
gām̐ṭabu nāsannu laṁṭi kaṁduvam̐ jĕnagunŏgo
vāḍabu nāgorigalu valalam̐ bĕṭṭīne
(||||)
tappagasūsunŏgo tadigŏni ramaṇum̐ḍu
kappuramu norigichchi kalasunŏgo
dappidera navvu navvi daṁḍagu vachchunŏgo
sippilum̐ damagamulu simmirem̐sīne
(||||)
sĕlam̐gi movichchunŏgo śhrī veṁkaḍeśhvarum̐ḍu
alamelmaṁganaina nannalamu nŏgo
kalabugoluga num̐ḍi kadalu sĕppunŏgo
nali niṁtalonĕ vichchesi nannum̐dānĕ kūḍĕne