Selulaala yemi buddiseppere naagu

చెలులాల యేమి బుద్దిచెప్పేరే నాకు
Language

(॥పల్లవి॥)
చెలులాల యేమి బుద్దిచెప్పేరే నాకు
పిలుచుక రాఁగదరే ప్రియుని నిక్కడికి

(॥చెలు॥)
తలఁపు లోలోననే దాఁచవచ్చుఁగాక మరి
వలపు దాఁచవచ్చునా వడి నెందైనా
చల మెప్పుడైనాను సాదించవచ్చుగాక
వలరాజు సాదించవచ్చునా పుడమిని

(॥చెలు॥)
వన్నె లెమ్మెలకుఁ జూపవచ్చుంగాక తొడిఁబడ
చన్నులు చూపవచ్చునా సబలోనను
పన్నిన పంతమె కడుం బచారించవచ్చుఁగాక
సన్న దమకము పచారించవచ్చునా

(॥చెలు॥)
వేడుకతో గొలువులో విడె మియ్యవచ్చుఁగాక
యేడనైనా మోవితేనె లియ్యవచ్చునా
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్నునేఁడు
కూడుమనవచ్చుఁగాక కొంచుమనవచ్చునా

(||pallavi||)
sĕlulāla yemi buddisĕppere nāgu
pilusuga rām̐gadare priyuni nikkaḍigi

(||sĕlu||)
talam̐pu lolonane dām̐savachchum̐gāga mari
valabu dām̐savachchunā vaḍi nĕṁdainā
sala mĕppuḍainānu sādiṁchavachchugāga
valarāju sādiṁchavachchunā puḍamini

(||sĕlu||)
vannĕ lĕmmĕlagum̐ jūbavachchuṁgāga tŏḍim̐baḍa
sannulu sūbavachchunā sabalonanu
pannina paṁtamĕ kaḍuṁ basāriṁchavachchum̐gāga
sanna damagamu pasāriṁchavachchunā

(||sĕlu||)
veḍugado gŏluvulo viḍĕ miyyavachchum̐gāga
yeḍanainā movidenĕ liyyavachchunā
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannunem̐ḍu
kūḍumanavachchum̐gāga kŏṁchumanavachchunā