Selulaala yeemaada seppare meeru

చెలులాల యీమాట చెప్పరే మీరు
Language

(॥పల్లవి॥)
చెలులాల యీమాట చెప్పరే మీరు
నిలువునఁ గరఁగితి నిజమైతిఁ దనకు

(॥చెలు॥)
కన్ను సన్న సేయఁబోతే కసరై తోఁచెనేమో
విన్నపించి తోడుకరావే విభుని
మిన్నక కనే నవ్వఁబోతే మించి వెంగెమాయనేమో
అన్నిటాఁ దెలుసుకొనీ నలుకేలే తనకు

(॥చెలు॥)
గొప్పమాట లాడఁబోతే కోపమైతోఁచెనేమో
చెప్పరే యాతని కిది చెల్లదని
రెప్పలెత్తి చూడఁబోతే రేసులై తోఁచెనేమో
తప్పులెల్లా వొప్పులయ్యీఁ దడవేలే ఇఁకను

(॥చెలు॥)
రతికి మంచమెక్కితే రాజసమై తోఁచెనేమో
యితవుగాఁ దనమాతి యెగ్గు వాపరే
సతమై శ్రీ వేంకటేశ్వరుఁడు న న్నిటు గూడె
కతలాయ వలపులు కడమేమే తనకు

(||pallavi||)
sĕlulāla yīmāḍa sĕppare mīru
niluvunam̐ garam̐gidi nijamaidim̐ danagu

(||sĕlu||)
kannu sanna seyam̐bode kasarai tom̐sĕnemo
vinnabiṁchi toḍugarāve vibhuni
minnaga kane navvam̐bode miṁchi vĕṁgĕmāyanemo
anniḍām̐ dĕlusugŏnī nalugele tanagu

(||sĕlu||)
gŏppamāḍa lāḍam̐bode kobamaidom̐sĕnemo
sĕppare yādani kidi sĕlladani
rĕppalĕtti sūḍam̐bode resulai tom̐sĕnemo
tappulĕllā vŏppulayyīm̐ daḍavele im̐kanu

(||sĕlu||)
radigi maṁchamĕkkide rājasamai tom̐sĕnemo
yidavugām̐ danamādi yĕggu vābare
sadamai śhrī veṁkaḍeśhvarum̐ḍu na nniḍu gūḍĕ
kadalāya valabulu kaḍameme tanagu