Selulaala yaadani sitta mimka nettunnado

చెలులాల యాతని చిత్త మిఁక నెట్టున్నదో
Language

(॥పల్లవి॥)
చెలులాల యాతని చిత్త మిఁక నెట్టున్నదో
తెలియఁజెప్పరే నా తెరఁగెల్లా మీరు

(॥చెలు॥)
చెలఁగి మాఁటాడితేను సిగ్గులు మోమున నిండీ
అలరి చూచేనంటే నాసలు రేఁగీ
తలఁచితే వేడుకతో తనువెల్లాఁ బులకించీ
యెలమి నా ముచ్చటలు యేమని చెప్పుదునే

(॥చెలు॥)
చనుఁగవ నొత్తితేను సంతోసము లుప్పతిలీ
పెనఁగితేఁ దమకము పెచ్చువెరిఁగీ
తనతోనే నవ్వితేను తరితీపు లెచ్చీని
తనివోని నావలపు దాఁచ నెట్టువచ్చునే

(॥చెలు॥)
కాయము సోఁకించితే గక్కనఁ గళలంటీని
చేయి చాఁచి చెనకితే చెమరించీని
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁ గూడె
చాయల నీకోరికలు సరుగ నీడేరెనే

(||pallavi||)
sĕlulāla yādani sitta mim̐ka nĕṭṭunnado
tĕliyam̐jĕppare nā tĕram̐gĕllā mīru

(||sĕlu||)
sĕlam̐gi mām̐ṭāḍidenu siggulu momuna niṁḍī
alari sūsenaṁṭe nāsalu rem̐gī
talam̐side veḍugado tanuvĕllām̐ bulagiṁchī
yĕlami nā muchchaḍalu yemani sĕppudune

(||sĕlu||)
sanum̐gava nŏttidenu saṁtosamu luppadilī
pĕnam̐gidem̐ damagamu pĕchchuvĕrim̐gī
tanadone navvidenu taridību lĕchchīni
tanivoni nāvalabu dām̐sa nĕṭṭuvachchune

(||sĕlu||)
kāyamu som̐kiṁchide gakkanam̐ gaḽalaṁṭīni
seyi sām̐si sĕnagide sĕmariṁchīni
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐ gūḍĕ
sāyala nīgorigalu saruga nīḍerĕne