చెలులాల మీకేలే చెల్లఁబో వొలపక్షాలు
(॥పల్లవి॥)
చెలులాల మీకేలే చెల్లఁబో వొలపక్షాలు
మలసి సరిగాఁ జూచి మమ్ము నొడఁగూర్చరే
(॥చెలు॥)
ఆడనే వున్నాఁడు తాను ఆసలాసలనే పెట్టి
యేడలేని బుద్దులు మీరేల చెప్పేరే
వేడుకకు వలవఁగా వెన్నెలలు వేఁడులాయ
యీడనుండే యెంత బయలీఁదించేరే
(॥చెలు॥)
కన్నులఁ దప్పక కాఁకలే రేఁచీ దాను
ఇన్నియుఁ దెలిసి యేల యెడతాఁకేరే
చెన్నుమీరఁ దలఁచఁగా చిగురులు వాండ్లాయ
సన్నల నావొడివట్టి చవులెంత చూపేరే
(॥చెలు॥)
ఇప్పుడే యీడు వచ్చి ఇంటిలో బండుండీఁ దాను
కప్పురమబ్బీ మీరేల గడెవెట్టేరే
తప్పనెలమేల్మంగను తాను శ్రీవేంకటేశుఁడు
అప్పుడే నన్నేలె నెంత ఆఱడిఁబెట్టేరే
(||pallavi||)
sĕlulāla mīgele sĕllam̐bo vŏlabakṣhālu
malasi sarigām̐ jūsi mammu nŏḍam̐gūrsare
(||sĕlu||)
āḍane vunnām̐ḍu tānu āsalāsalane pĕṭṭi
yeḍaleni buddulu mīrela sĕppere
veḍugagu valavam̐gā vĕnnĕlalu vem̐ḍulāya
yīḍanuṁḍe yĕṁta bayalīm̐diṁchere
(||sĕlu||)
kannulam̐ dappaga kām̐kale rem̐sī dānu
inniyum̐ dĕlisi yela yĕḍadām̐kere
sĕnnumīram̐ dalam̐sam̐gā sigurulu vāṁḍlāya
sannala nāvŏḍivaṭṭi savulĕṁta sūbere
(||sĕlu||)
ippuḍe yīḍu vachchi iṁṭilo baṁḍuṁḍīm̐ dānu
kappuramabbī mīrela gaḍĕvĕṭṭere
tappanĕlamelmaṁganu tānu śhrīveṁkaḍeśhum̐ḍu
appuḍe nannelĕ nĕṁta āṟaḍim̐bĕṭṭere