చెలులాల మీతోఁ జెప్ప సిగ్గయ్యీ నాకు
(॥పల్లవి॥)
చెలులాల మీతోఁ జెప్ప సిగ్గయ్యీ నాకు
చలముతో మోవితేనె సారెకు నిచ్చీని
(॥చెలు॥)
చూడవే యీతఁడు నన్ను సుద్దులేమి యడిగీని
యేడలేనివారు తనయింట నుండఁగా
ఆడ వేఁగినంతాఁ దాను ఆపెవద్దనుండి వచ్చి
వేడుకతో నావద్దివీణె వాయించీని
(॥చెలు॥)
కంటినే యిప్పు డితనికతకారిచేఁతలెల్లా
వొంటి నేనుండఁగా నావొడి వట్టీని
తొంటిపొందులవారెల్లా తోడనే కాచుకుండఁగా
అంటీనే నాపయ్యద అందరూఁ జూడఁగానే
(॥చెలు॥)
తగునే యీతనికి యీతరితీపువలపులు
పగటురతులఁ గూడి పైకొనీని
జిగిమీర నవ్వుతాను శ్రీవేంకటేశ్వరుఁడు
మిగులా నావసమై మెచ్చుల మెచ్చీని
(||pallavi||)
sĕlulāla mīdom̐ jĕppa siggayyī nāgu
salamudo movidenĕ sārĕgu nichchīni
(||sĕlu||)
sūḍave yīdam̐ḍu nannu suddulemi yaḍigīni
yeḍalenivāru tanayiṁṭa nuṁḍam̐gā
āḍa vem̐ginaṁtām̐ dānu ābĕvaddanuṁḍi vachchi
veḍugado nāvaddivīṇĕ vāyiṁchīni
(||sĕlu||)
kaṁṭine yippu ḍidanigadagārisem̐talĕllā
vŏṁṭi nenuṁḍam̐gā nāvŏḍi vaṭṭīni
tŏṁṭibŏṁdulavārĕllā toḍane kāsuguṁḍam̐gā
aṁṭīne nābayyada aṁdarūm̐ jūḍam̐gāne
(||sĕlu||)
tagune yīdanigi yīdaridībuvalabulu
pagaḍuradulam̐ gūḍi paigŏnīni
jigimīra navvudānu śhrīveṁkaḍeśhvarum̐ḍu
migulā nāvasamai mĕchchula mĕchchīni