చెలులాల బుద్దులెన్ని చెప్పేరే నాకు
(॥పల్లవి॥)
చెలులాల బుద్దులెన్ని చెప్పేరే నాకు
చెలువుఁడే వలెనంటే సేసవెట్టేఁ గాక
(॥చెలు॥)
తలఁపొకచో నుండఁగా తమి యెట్టు రేఁచవచ్చు
పిలుపు లాలించఁగాను పెనఁగుటెట్టు
పలుపొ(కొ) కచో నుండఁగా భావమెట్టు గరఁగీని
బలిమి నే నెటువలెఁ బైకొందునే యతని
(॥చెలు॥)
నవ్వు లొకచో నుండఁగా ననుపెట్టు సేయవచ్చు
మువ్వంకలాఁ జూడఁగా మొక్కట యెట్టు
వువ్విళ్ళొక్కచో నుండఁగా వొడివట్టి యియ్యనేల
రవ్వసేసి నేనెట్టు రతికిఁ బిలుతునే
(॥చెలు॥)
వేడు కొకచో నుండఁగా వెస నంట నెట్టువచ్చు
వాడికలు చూపఁగాను వద్దనుటెట్టు
పొడితో నలమేల్మఁగపతి శ్రీవేంకటేశుఁడు
కూడె నన్ను నింకానెట్టు కొసరుదునే
(||pallavi||)
sĕlulāla buddulĕnni sĕppere nāgu
sĕluvum̐ḍe valĕnaṁṭe sesavĕṭṭem̐ gāga
(||sĕlu||)
talam̐pŏgaso nuṁḍam̐gā tami yĕṭṭu rem̐savachchu
pilubu lāliṁcham̐gānu pĕnam̐guḍĕṭṭu
palubŏ(kŏ) kaso nuṁḍam̐gā bhāvamĕṭṭu garam̐gīni
balimi ne nĕḍuvalĕm̐ baigŏṁdune yadani
(||sĕlu||)
navvu lŏgaso nuṁḍam̐gā nanubĕṭṭu seyavachchu
muvvaṁkalām̐ jūḍam̐gā mŏkkaḍa yĕṭṭu
vuvviḽḽŏkkaso nuṁḍam̐gā vŏḍivaṭṭi yiyyanela
ravvasesi nenĕṭṭu radigim̐ biludune
(||sĕlu||)
veḍu kŏgaso nuṁḍam̐gā vĕsa naṁṭa nĕṭṭuvachchu
vāḍigalu sūbam̐gānu vaddanuḍĕṭṭu
pŏḍido nalamelmam̐gabadi śhrīveṁkaḍeśhum̐ḍu
kūḍĕ nannu niṁkānĕṭṭu kŏsarudune