చెలుల మోములు చూచి చిరునవ్వు లేమిటికి
(॥పల్లవి॥)
చెలుల మోములు చూచి చిరునవ్వు లేమిటికి
చెలఁగి యాతనిసేవ సేయవే ఇఁకను
(॥చెలు॥)
మనసు లేకములైన మరియేల యెడమాఁట
వినయమే కలిగితే వింతలేదు
చెనకులకు లోనైన సిగ్గులకుఁ బనియేమి
వొనగూడి యతనితో నుండవే ఇఁకను
(॥చెలు॥)
తేరిచూచన మీఁద తెరమఱఁగు లవి యేల
కూరిములు దొరకితేఁ గొసరవలదు
తారుకాణైనచో తగవులడుగఁగనేల
చేరి చుట్టరికంబు సేయవే ఇఁకను
(॥చెలు॥)
సేసవెట్టినవెనకఁ జెప్పనేఁటికి వావి
బాసలే వొనరితేఁ బాయనేల
యాసరిని శ్రీవేంకటేశుఁ గూడితి విపుడు
వాసితో నీవితని వదలకువే ఇఁకను
(||pallavi||)
sĕlula momulu sūsi sirunavvu lemiḍigi
sĕlam̐gi yādaniseva seyave im̐kanu
(||sĕlu||)
manasu legamulaina mariyela yĕḍamām̐ṭa
vinayame kaligide viṁtaledu
sĕnagulagu lonaina siggulagum̐ baniyemi
vŏnagūḍi yadanido nuṁḍave im̐kanu
(||sĕlu||)
terisūsana mīm̐da tĕramaṟam̐gu lavi yela
kūrimulu dŏragidem̐ gŏsaravaladu
tārugāṇainaso tagavulaḍugam̐ganela
seri suṭṭarigaṁbu seyave im̐kanu
(||sĕlu||)
sesavĕṭṭinavĕnagam̐ jĕppanem̐ṭigi vāvi
bāsale vŏnaridem̐ bāyanela
yāsarini śhrīveṁkaḍeśhum̐ gūḍidi vibuḍu
vāsido nīvidani vadalaguve im̐kanu