Sellune neegimkam jese semtalellaanu

చెల్లునే నీకిఁకఁ జేసే చేఁతలెల్లాను
Language

(॥పల్లవి॥)
చెల్లునే నీకిఁకఁ జేసే చేఁతలెల్లాను
మొల్లమి నాకతఁడేల మొగమోడకుండీనే

(॥చెల్లు॥)
చెప్పిన బుద్దు లాతని చెవిలోనే వుండఁగాను
కప్పురగందుల నేల కైకొనీనే
తప్పని బాసలు నీవాతనిచేఁ జేయించుకోంగా
చొప్పుగా వాడలోవారిఁ జూడనేల చూచీనే

(॥చెల్లు॥)
వదల కాతని నీ వసము సేసుకుండఁగా
యెదుటివారితో మరియేల నవ్వీనే
కదిసి యాతనితో నేకతాలు నీ వాడఁగాను
మదిరాక్షులతో నేల మాఁటలాడీనే

(॥చెల్లు॥)
యేపొద్దూ నాతని నీవు యెదఁబెట్టుకుండఁగాను
పైపై నెవ్వరి కేల బాఁతి పడీనే
యేపున శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నన్ను నేలె
చేపట్టి నీయెప్పణేల సేయకమానీనే

(||pallavi||)
sĕllune nīgim̐kam̐ jese sem̐talĕllānu
mŏllami nāgadam̐ḍela mŏgamoḍaguṁḍīne

(||sĕllu||)
sĕppina buddu lādani sĕvilone vuṁḍam̐gānu
kappuragaṁdula nela kaigŏnīne
tappani bāsalu nīvādanisem̐ jeyiṁchugoṁgā
sŏppugā vāḍalovārim̐ jūḍanela sūsīne

(||sĕllu||)
vadala kādani nī vasamu sesuguṁḍam̐gā
yĕduḍivārido mariyela navvīne
kadisi yādanido negadālu nī vāḍam̐gānu
madirākṣhulado nela mām̐ṭalāḍīne

(||sĕllu||)
yebŏddū nādani nīvu yĕdam̐bĕṭṭuguṁḍam̐gānu
paibai nĕvvari kela bām̐ti paḍīne
yebuna śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ nannu nelĕ
sebaṭṭi nīyĕppaṇela seyagamānīne