చెల్లునయ్య నీవు నాకుఁ జేసే చేఁత
(॥పల్లవి॥)
చెల్లునయ్య నీవు నాకుఁ జేసే చేఁత
యెల్లవారిలోన నిది యెక్కుడా నాకు
(॥చెల్లు॥)
చనవిచ్చితివి నీవు చలము నే మానితి
యెనసి వేఁడుకొనేవు యెక్కుడా నాకు
పెనఁగితివిట్టే నేఁడు బిగువులు సడలితి
యినుమారు పంతమిచ్చేవెక్కుడా నాకు
(॥చెల్లు॥)
పయ్యద నీవంటితివి పనులకు లొనైతి
యియ్యరాని బాసయిచ్చే వెక్కడా నాకు
నెయ్యము పై వేసితివి నీవే నేనై యుంటి
యెయ్యడ చూచినా నవ్వేవెక్కుడా నాకు
(॥చెల్లు॥)
కందువ దెలిపితివి కాఁగిలించుకొంటెనిన్ను
యిందర మెచ్చ మన్నించే వెక్కుడా నాకు
కందర్పగురుఁడ శ్రీ వెంకటరాయ కూడితివి
యింద నందూనేలితివెక్కుడా నాకు
(||pallavi||)
sĕllunayya nīvu nāgum̐ jese sem̐ta
yĕllavārilona nidi yĕkkuḍā nāgu
(||sĕllu||)
sanavichchidivi nīvu salamu ne mānidi
yĕnasi vem̐ḍugŏnevu yĕkkuḍā nāgu
pĕnam̐gidiviṭṭe nem̐ḍu biguvulu saḍalidi
yinumāru paṁtamichchevĕkkuḍā nāgu
(||sĕllu||)
payyada nīvaṁṭidivi panulagu lŏnaidi
yiyyarāni bāsayichche vĕkkaḍā nāgu
nĕyyamu pai vesidivi nīve nenai yuṁṭi
yĕyyaḍa sūsinā navvevĕkkuḍā nāgu
(||sĕllu||)
kaṁduva dĕlibidivi kām̐giliṁchugŏṁṭĕninnu
yiṁdara mĕchcha manniṁche vĕkkuḍā nāgu
kaṁdarbagurum̐ḍa śhrī vĕṁkaḍarāya kūḍidivi
yiṁda naṁdūnelidivĕkkuḍā nāgu