Sellunammaa aadanigi sesedi semtalellaa

చెల్లునమ్మా ఆతనికి సేసేటి చేఁతలెల్లా
Language

(॥పల్లవి॥)
చెల్లునమ్మా ఆతనికి సేసేటి చేఁతలెల్లా
కొల్లున నవ్వెఁ గదమ్మా గోవిందదేవుఁడు

(॥చెల్లు॥)
వీడెపుఁ బెదవులతో వినోదా లాడుకొంటా
వాడ వనితలనెల్లా వావు లడిగీ
వాడికలు సేసుకొని వలపులు పైఁ జల్లీ
కోడెకాఁడు గదవమ్మా గోవిందదేవుఁడు

(॥చెల్లు॥)
దంటమాఁటలెల్లా నాడి తమిరేఁచుకొంటాను
సొంటులు సోదించీఁ దాను సుదతులను
అంటిముట్టి చనుఁగవలందు గురుతులునించీ
గొంటరివాఁడు గదమ్మా గోవిందదేవుఁడు

(॥చెల్లు॥)
వల్లెవాటుఁ బయ్యెదతో వరుసలు బెట్టుకొంటా
చల్లనికాఁగిటఁ గూడీ సతులనెల్లా
తెల్లమి శ్రీవేంకటాద్రిఁ దిరుపతిలో నున్నాఁడు
కొల్లకాఁడు గదవమ్మా గోవిందదేవుఁడు

(||pallavi||)
sĕllunammā ādanigi seseḍi sem̐talĕllā
kŏlluna navvĕm̐ gadammā goviṁdadevum̐ḍu

(||sĕllu||)
vīḍĕbum̐ bĕdavulado vinodā lāḍugŏṁṭā
vāḍa vanidalanĕllā vāvu laḍigī
vāḍigalu sesugŏni valabulu paim̐ jallī
koḍĕgām̐ḍu gadavammā goviṁdadevum̐ḍu

(||sĕllu||)
daṁṭamām̐ṭalĕllā nāḍi tamirem̐sugŏṁṭānu
sŏṁṭulu sodiṁchīm̐ dānu sudadulanu
aṁṭimuṭṭi sanum̐gavalaṁdu guruduluniṁchī
gŏṁṭarivām̐ḍu gadammā goviṁdadevum̐ḍu

(||sĕllu||)
vallĕvāḍum̐ bayyĕdado varusalu bĕṭṭugŏṁṭā
sallanigām̐giḍam̐ gūḍī sadulanĕllā
tĕllami śhrīveṁkaḍādrim̐ dirubadilo nunnām̐ḍu
kŏllagām̐ḍu gadavammā goviṁdadevum̐ḍu