చెల్లుబడిగలవాఁడు సేసినంతాఁ జెల్లెఁ గాక
(॥పల్లవి॥)
చెల్లుబడిగలవాఁడు సేసినంతాఁ జెల్లెఁ గాక
వొల్లనే రెండూ నడపి వొద్దనేమా నేము
(॥చెల్లు॥)
తప్పకచూచినవాఁడు తలవంచఁ దనకేలే
అప్పుడే యెవ్వరైనాఁ దన్నా డేరా
చెప్పితే గుఱ్ఱనేవాఁడు చేరి నవ్వఁ దనకేలే
తపలు నెగ్గులు వట్టి తన్ను సొలసేరా
(॥చెల్లు॥)
వేఁడుకొనేవాఁడు తాను వీరుత్తరములేలే
నేఁడే తన కింతలో నీటువొయీనా
ఆఁడువారిసాదించువాఁ డందరిఁ దగులనేలే
పోఁడిమిఁ దనగుణము బూమెల్ల నెఱఁగదా
(॥చెల్లు॥)
వొరుల బోదించువాఁడు వుప్పరాలెగయనేలే
వోరిమైనగుణముతో నుండరాదా
సిరులమించినతాను శ్రీవేంకటాద్రివాఁడు
కరఁగించి నన్నుఁ గూడె కాదనఁబొయ్యేనా
(||pallavi||)
sĕllubaḍigalavām̐ḍu sesinaṁtām̐ jĕllĕm̐ gāga
vŏllane rĕṁḍū naḍabi vŏddanemā nemu
(||sĕllu||)
tappagasūsinavām̐ḍu talavaṁcham̐ danagele
appuḍe yĕvvarainām̐ dannā ḍerā
sĕppide guṭranevām̐ḍu seri navvam̐ danagele
tabalu nĕggulu vaṭṭi tannu sŏlaserā
(||sĕllu||)
vem̐ḍugŏnevām̐ḍu tānu vīruttaramulele
nem̐ḍe tana kiṁtalo nīḍuvŏyīnā
ām̐ḍuvārisādiṁchuvām̐ ḍaṁdarim̐ dagulanele
pom̐ḍimim̐ danaguṇamu būmĕlla nĕṟam̐gadā
(||sĕllu||)
vŏrula bodiṁchuvām̐ḍu vupparālĕgayanele
vorimainaguṇamudo nuṁḍarādā
sirulamiṁchinadānu śhrīveṁkaḍādrivām̐ḍu
karam̐giṁchi nannum̐ gūḍĕ kādanam̐bŏyyenā