చెల్లనిచేఁతలు మీరు సేసేరు గాక
(॥పల్లవి॥)
చెల్లనిచేఁతలు మీరు సేసేరు గాక
గొల్లెతలు హరితోడ గోసనాస యేఁటికే
(॥చెల్ల॥)
బాలుని నవ్వకురమ్మ పాలదొంగ వీఁడంటా
యేలే మీతో పిన్నవాఁడు ఇంతకోపునా
గేలిసేయకురేయమ్మ గీరలు మెయిఁ దీసెనంటా
నీలవర్ణుఁ డిందునెల్లా నేర్చవచ్చెనా
(॥చెల్ల॥)
యేడుపించకు రేయమ్మ యెంగిలిముద్దిచ్చేమంటా
చూడఁ బిన్నవానితోడ సుద్దు లింతేలే
ఆడుకోకురమ్మ సిగ్గు లందరివీఁ జూచెనంటా
యీడుగానివారితోడ నెగ్గు లింత గలదా
(॥చెల్ల॥)
చెక్కులు గిల్లకురమ్మ చేఁతలెల్లఁ జేసీనంటా
పెక్కులు నేరుతుమంటాఁ బేలనేఁటికే
యెక్కుడు శ్రీవేంకటేశుఁ డిన్నిటా మిమ్మేలువాఁడు
చక్కనిబిడ్డని నింత సాదించనేఁటికే
(||pallavi||)
sĕllanisem̐talu mīru seseru gāga
gŏllĕdalu haridoḍa gosanāsa yem̐ṭige
(||sĕlla||)
bāluni navvaguramma pāladŏṁga vīm̐ḍaṁṭā
yele mīdo pinnavām̐ḍu iṁtagobunā
geliseyagureyamma gīralu mĕyim̐ dīsĕnaṁṭā
nīlavarṇum̐ ḍiṁdunĕllā nersavachchĕnā
(||sĕlla||)
yeḍubiṁchagu reyamma yĕṁgilimuddichchemaṁṭā
sūḍam̐ binnavānidoḍa suddu liṁtele
āḍugoguramma siggu laṁdarivīm̐ jūsĕnaṁṭā
yīḍugānivāridoḍa nĕggu liṁta galadā
(||sĕlla||)
sĕkkulu gillaguramma sem̐talĕllam̐ jesīnaṁṭā
pĕkkulu nerudumaṁṭām̐ belanem̐ṭige
yĕkkuḍu śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā mimmeluvām̐ḍu
sakkanibiḍḍani niṁta sādiṁchanem̐ṭige