Sellambo yemayyaa yimtaseduraa neevu

చెల్లఁబో యేమయ్యా యింతసేతురా నీవు
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో యేమయ్యా యింతసేతురా నీవు
వెల్లవిరిఁ దమకాన వేఁగించీఁ దాను

(॥చెల్లఁ॥)
చిప్పలవంటికన్నులచెలి నీ కెదురుచూచీ
యెప్పుడు వత్తువోయంటా నింటా వాకిట
చొప్పుగా నీవేపెతోను జా(జూ?) జాలాడే దెఱఁగదు
వొప్పుగా నీదాక నమ్మివున్నది దా నాడను

(॥చెల్లఁ॥)
అంతరంగపుటాసల నట్టె నీవు గూడేవంటా
మంతనానఁ దలపోసీ మంచము మీఁద
యింతులపాట వింటా నీవందునుండే దెఱఁగదు
చెంత నీవేళ గాచుక చెలఁగీఁదా నాడను

(॥చెల్లఁ॥)
వెలినుండి నీవు రాఁగా వేడుకతో నవ్వు నవ్వీ
అలసతి వెంటవచ్చే ద దెఱఁగదు
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశుఁడ
కలసితి విప్పుడంటా సొలసీఁదా నాడను

(||pallavi||)
sĕllam̐bo yemayyā yiṁtasedurā nīvu
vĕllavirim̐ damagāna vem̐giṁchīm̐ dānu

(||sĕllam̐||)
sippalavaṁṭigannulasĕli nī kĕdurusūsī
yĕppuḍu vattuvoyaṁṭā niṁṭā vāgiḍa
sŏppugā nīvebĕdonu jā(jū?) jālāḍe dĕṟam̐gadu
vŏppugā nīdāga nammivunnadi dā nāḍanu

(||sĕllam̐||)
aṁtaraṁgabuḍāsala naṭṭĕ nīvu gūḍevaṁṭā
maṁtanānam̐ dalabosī maṁchamu mīm̐da
yiṁtulabāḍa viṁṭā nīvaṁdunuṁḍe dĕṟam̐gadu
sĕṁta nīveḽa gāsuga sĕlam̐gīm̐dā nāḍanu

(||sĕllam̐||)
vĕlinuṁḍi nīvu rām̐gā veḍugado navvu navvī
alasadi vĕṁṭavachche da dĕṟam̐gadu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhum̐ḍa
kalasidi vippuḍaṁṭā sŏlasīm̐dā nāḍanu