చెల్లఁబో సిగ్గు లేదటె చెల్లెల
(॥పల్లవి॥)
చెల్లఁబో సిగ్గు లేదటె చెల్లెల
అల్లన నిన్నెంచుకోవే అక్కరో నేఁడు
(॥చెల్ల॥)
సేసకొప్పేల వదలె చెల్లెలా
ఆసుద్ది బావ నడుగు మక్కరో నీవు
సేసితివే బలుచేఁత చెల్లెలా
ఆస నీవంటిదే కాదా అక్కరో నాకు
(॥చెల్ల॥)
చెంది నిన్ను నమ్మితిఁగా చెల్లెలా
అందుఁ బాలు గద్దు గదె అక్కరో నాకు
చిందువందాయ వావులు చెల్లెలా
అంది నీమారె నేను అక్కరో నేఁడు
(॥చెల్ల॥)
చిన్నదానవంటా నుంటిఁ జెల్లెలా
అన్నిటా నీవే పెంచితి వక్కరో నన్ను
చిన్నలు నీమేన నిండెఁ జెల్లెలా
అన్నిటా శ్రీవేంకటేశుఁ డక్కరో కూడెనో
(||pallavi||)
sĕllam̐bo siggu ledaḍĕ sĕllĕla
allana ninnĕṁchugove akkaro nem̐ḍu
(||sĕlla||)
sesagŏppela vadalĕ sĕllĕlā
āsuddi bāva naḍugu makkaro nīvu
sesidive balusem̐ta sĕllĕlā
āsa nīvaṁṭide kādā akkaro nāgu
(||sĕlla||)
sĕṁdi ninnu nammidim̐gā sĕllĕlā
aṁdum̐ bālu gaddu gadĕ akkaro nāgu
siṁduvaṁdāya vāvulu sĕllĕlā
aṁdi nīmārĕ nenu akkaro nem̐ḍu
(||sĕlla||)
sinnadānavaṁṭā nuṁṭim̐ jĕllĕlā
anniḍā nīve pĕṁchidi vakkaro nannu
sinnalu nīmena niṁḍĕm̐ jĕllĕlā
anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍakkaro kūḍĕno