Sellambo nannum jenagi senagimchugonanela

చెల్లఁబో నన్నుఁ జెనకి చెనకించుకొననేల
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో నన్నుఁ జెనకి చెనకించుకొననేల
చిల్లర నీ మేనిమీఁది చెనకులే చాలవా

(॥చెల్ల॥)
ననుఁగని వూరకైన నవ్వేవు కిమ్ముల నీ-
పను లిందరికి నవ్వుఁబాటుగాదా
నిను నీవు చూచుకోవు నెయ్యమి నన్నొరసేవు
వొనర నీమే నిందరు నొరయుట చాలదా

(॥చెల్ల॥)
వెల్లవిరి నిజమే వేమారు నెరపేవు
కల్లతోడ నిజ మోపఁగలదటరా
బల్లిదాన దొడ్డదొడ్డబాసలెల్లఁ జేసేవు
తొల్లి జెల్లనిమాడకు దొడ్డముద్రే కాదా

(॥చెల్ల॥)
మెచ్చి నన్నుఁ గూడితివి మేలపుశ్రీవేంకటేశ
యిచ్చట మెరమెచ్చులే యిందాఁకా గాదా
పచ్చిచేసే వింకా నీపడఁతులచేత మున్ను
పచ్చివెచ్చి మాటలనుఁ బడినదేచాలదా

(||pallavi||)
sĕllam̐bo nannum̐ jĕnagi sĕnagiṁchugŏnanela
sillara nī menimīm̐di sĕnagule sālavā

(||sĕlla||)
nanum̐gani vūragaina navvevu kimmula nī-
panu liṁdarigi navvum̐bāḍugādā
ninu nīvu sūsugovu nĕyyami nannŏrasevu
vŏnara nīme niṁdaru nŏrayuḍa sāladā

(||sĕlla||)
vĕllaviri nijame vemāru nĕrabevu
kalladoḍa nija mobam̐galadaḍarā
ballidāna dŏḍḍadŏḍḍabāsalĕllam̐ jesevu
tŏlli jĕllanimāḍagu dŏḍḍamudre kādā

(||sĕlla||)
mĕchchi nannum̐ gūḍidivi melabuśhrīveṁkaḍeśha
yichchaḍa mĕramĕchchule yiṁdām̐kā gādā
pachchisese viṁkā nībaḍam̐tulaseda munnu
pachchivĕchchi māḍalanum̐ baḍinadesāladā