చెల్లఁ బో యీ తగవు చెప్పరే మీరు
(॥పల్లవి॥)
చెల్లఁ బో యీ తగవు చెప్పరే మీరు
వెల్లవిరి యిందుకే పో వెరగయ్యీ నాకు
(॥చెల్లఁ॥)
వూరకుండఁగ నాతో వొద్దిక మాటలాడీని
కారణములేనిపొందు కద్దా బూమి
వూరికెల్ల తా జాణ వుప్పవేసి పొత్తుగూడీ
నారుకొన్నయిందుకేపో నవ్వువచ్చు నాకు
(॥చెల్లఁ॥)
తలవంచుకుండఁగాఁ జిత్తరువులే చూపవచ్చీ
పిలువనిపేరటము ప్రియమయ్యీనా
బలువు చూడవే వీఁడు బండిగట్టీ చింకలను
తలఁపున యిందకేపో తమివుట్టీ నాకు
(॥చెల్లఁ॥)
సిగ్గుతో నే నుండఁగాను చెక్కునొక్కవచ్చీని
దగ్గరి చేత మొక్కఁగా తప్పుగలదా
నిగ్గుల శ్రీ వేంకటాద్రినాలయుఁడు నన్నుఁ గూడె
తగ్గులే కిందుకేపో సంతసమయ్యీ నాకు
(||pallavi||)
sĕllam̐ bo yī tagavu sĕppare mīru
vĕllaviri yiṁduge po vĕragayyī nāgu
(||sĕllam̐||)
vūraguṁḍam̐ga nādo vŏddiga māḍalāḍīni
kāraṇamulenibŏṁdu kaddā būmi
vūrigĕlla tā jāṇa vuppavesi pŏttugūḍī
nārugŏnnayiṁdugebo navvuvachchu nāgu
(||sĕllam̐||)
talavaṁchuguṁḍam̐gām̐ jittaruvule sūbavachchī
piluvaniberaḍamu priyamayyīnā
baluvu sūḍave vīm̐ḍu baṁḍigaṭṭī siṁkalanu
talam̐puna yiṁdagebo tamivuṭṭī nāgu
(||sĕllam̐||)
siggudo ne nuṁḍam̐gānu sĕkkunŏkkavachchīni
daggari seda mŏkkam̐gā tappugaladā
niggula śhrī veṁkaḍādrinālayum̐ḍu nannum̐ gūḍĕ
taggule kiṁdugebo saṁtasamayyī nāgu