Sellam bo aamtadaanigi siggu dalamsugovaddaa

చెల్లఁ బో ఆఁటదానికి సిగ్గు దలఁచుకోవద్దా
Language

(॥పల్లవి॥)
చెల్లఁ బో ఆఁటదానికి సిగ్గు దలఁచుకోవద్దా
చెల్లుబడి గానిచోట చెనకఁగవచ్చునా

(॥॥)
ఆతఁడూ నేనూ మాటనాడుతా నుండఁగానే
యీతల నీవేల కానుకియ్యవచ్చేవే
రాతిరిఁ ఒగలు నాకు రమణుఁడై వుండఁ గా
చేతులె త్తి నీవేల సేసలుచల్లేవే

(॥॥)
పొదలి నే మిద్దరముఁ బొత్తుల నుండఁగానే
సదరాన నీవేల కొసరవచ్చేవే
ముదమున మాలో నేము మొగములు చూచుకోఁగా
అదన నీకు నిఁక నడ్డాలు రాఁదగునా

(॥॥)
కలిసి నే మింతలోనే కాఁగిలించుకొనఁగాను
సొలసి మమ్ముఁ దప్పకచూచే విదేమే
యెలమి శ్రీ వేంకటేశుఁ డిటు నన్నుఁ గూడినాఁడు
వెలి నుండి నీ వెంత వెరగందేవే

(||pallavi||)
sĕllam̐ bo ām̐ṭadānigi siggu dalam̐sugovaddā
sĕllubaḍi gānisoḍa sĕnagam̐gavachchunā

(||||)
ādam̐ḍū nenū māḍanāḍudā nuṁḍam̐gāne
yīdala nīvela kānugiyyavachcheve
rādirim̐ ŏgalu nāgu ramaṇum̐ḍai vuṁḍam̐ gā
sedulĕ tti nīvela sesalusalleve

(||||)
pŏdali ne middaramum̐ bŏttula nuṁḍam̐gāne
sadarāna nīvela kŏsaravachcheve
mudamuna mālo nemu mŏgamulu sūsugom̐gā
adana nīgu nim̐ka naḍḍālu rām̐dagunā

(||||)
kalisi ne miṁtalone kām̐giliṁchugŏnam̐gānu
sŏlasi mammum̐ dappagasūse videme
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍiḍu nannum̐ gūḍinām̐ḍu
vĕli nuṁḍi nī vĕṁta vĕragaṁdeve