చెలియరో యన్నాళ్ళెనాఁ జిన్నదానవా
(॥పల్లవి॥)
చెలియరో యన్నాళ్ళెనాఁ జిన్నదానవా
యెలమి నీ విభునికి నియ్యవే విడెము
(॥చెలి॥)
నేరుపుగలయందుకు నెట్టుకమాటాడవలె
వోరుపుగల యందుకు వొడఁబడివుండవలె
కూరిమిగల యందుకు కూటమి నెరపవలె
వూరకే గోలతనాన నుందురా జవ్వనులు
(॥చెలి॥)
చనపుగలయందుకు సరసమాడఁగవలె
ననుపుగయందుకు నవ్వుతానుండఁగవలె
వినయము గలయందుకు వేమారు మొక్కఁగవలె
పెనఁగుతా సిగ్గులెల్లాఁ బెంతురా జవ్వనులు
(॥చెలి॥)
వేడుకగలయందుకు వేరు సేయకుండవలె
వాడిక గలయందుకు వైపుగా మెలఁగవలె
యాడనె శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్ను నేలె
తోడుగూడి వాసులకు జొత్తురా జవ్వనులు
(||pallavi||)
sĕliyaro yannāḽḽĕnām̐ jinnadānavā
yĕlami nī vibhunigi niyyave viḍĕmu
(||sĕli||)
nerubugalayaṁdugu nĕṭṭugamāḍāḍavalĕ
vorubugala yaṁdugu vŏḍam̐baḍivuṁḍavalĕ
kūrimigala yaṁdugu kūḍami nĕrabavalĕ
vūrage goladanāna nuṁdurā javvanulu
(||sĕli||)
sanabugalayaṁdugu sarasamāḍam̐gavalĕ
nanubugayaṁdugu navvudānuṁḍam̐gavalĕ
vinayamu galayaṁdugu vemāru mŏkkam̐gavalĕ
pĕnam̐gudā siggulĕllām̐ bĕṁturā javvanulu
(||sĕli||)
veḍugagalayaṁdugu veru seyaguṁḍavalĕ
vāḍiga galayaṁdugu vaibugā mĕlam̐gavalĕ
yāḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnu nelĕ
toḍugūḍi vāsulagu jŏtturā javvanulu