Seliyaro neevemta semtalaamdive

చెలియరో నీవెంత చేఁతలాఁడివే
Language

(॥పల్లవి॥)
చెలియరో నీవెంత చేఁతలాఁడివే
వెలయ నిప్పుడే యెన్నివేసాలు సేసేవే

(॥చెలి॥)
పెదవితేనెల తీపు బెరయించి పతితోను
ముదము రెట్టించి యెంతమాఁటలాడేవే
కదలుఁ గన్నుల చూపు కడఁగించి రెప్పలను
వదల కెందాఁగాను వలపు చల్లేవే

(॥చెలి॥)
గొప్ప చన్నుల మెఱఁగు గులికి యడియాసలు
వుప్పతిల నెంతేసివుబ్బు రేఁచేవే
ముప్పిరి నీలాల కొప్పు మురిపేలు చూపి చూపి
చొప్పులువేసి యెంత చొక్కులఁ వెట్టేవే

(॥చెలి॥)
చక్కని నీమొగమెత్తి సారెకు నయాలు నించి
పక్కన నప్పుల నెంత భ్రమయించేవే
యిక్కడ శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
నిక్కి నిక్కి చూచి యేమి నివ్వెరగందేవే

(||pallavi||)
sĕliyaro nīvĕṁta sem̐talām̐ḍive
vĕlaya nippuḍe yĕnnivesālu seseve

(||sĕli||)
pĕdavidenĕla tību bĕrayiṁchi padidonu
mudamu rĕṭṭiṁchi yĕṁtamām̐ṭalāḍeve
kadalum̐ gannula sūbu kaḍam̐giṁchi rĕppalanu
vadala kĕṁdām̐gānu valabu salleve

(||sĕli||)
gŏppa sannula mĕṟam̐gu guligi yaḍiyāsalu
vuppadila nĕṁtesivubbu rem̐seve
muppiri nīlāla kŏppu muribelu sūbi sūbi
sŏppuluvesi yĕṁta sŏkkulam̐ vĕṭṭeve

(||sĕli||)
sakkani nīmŏgamĕtti sārĕgu nayālu niṁchi
pakkana nappula nĕṁta bhramayiṁcheve
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu nelĕ
nikki nikki sūsi yemi nivvĕragaṁdeve