చెలియరో నీ మగఁడు సేసినభాగ్యము
(॥పల్లవి॥)
చెలియరో నీ మగఁడు సేసినభాగ్యము
యెలమి నిందుకు నాతఁ డెంత నోఁచెనే
(॥చెలి॥)
వంచి నీవు మొక్కితేను వలపులు రాలీని
ముంచి మాటలాడితేను ముద్దుగారీని
పంచలఁ బొలసితేను పైఁడిపోడి దోరిగీని
యెంచరాదా నీసింగార మేమిచెప్పేదే
(॥చెలి॥)
ముసిముసిగా నవ్వితే ముత్యాలు రాసులయ్యీ
కోసరి చూచితే మెఱుఁగులు రేఁగీని
ముసుఁగు దీసితేను మోహనమే వడిసీని
యెసఁగిననీవిలాస మేమిచెప్పేదే
(॥చెలి॥)
నిలిచితే నీపగటు నిలువు నూరు వండీని
సొలసితే నీవేడుక జోబ్బిలీ నిదే
యెలమి శ్రీవేంకటేశుఁడేలినల మేల్ మంగవు
యెలయింపునీ వొరపు లేమిచెప్పేదే
(||pallavi||)
sĕliyaro nī magam̐ḍu sesinabhāgyamu
yĕlami niṁdugu nādam̐ ḍĕṁta nom̐sĕne
(||sĕli||)
vaṁchi nīvu mŏkkidenu valabulu rālīni
muṁchi māḍalāḍidenu muddugārīni
paṁchalam̐ bŏlasidenu paim̐ḍiboḍi dorigīni
yĕṁcharādā nīsiṁgāra memisĕppede
(||sĕli||)
musimusigā navvide mutyālu rāsulayyī
kosari sūside mĕṟum̐gulu rem̐gīni
musum̐gu dīsidenu mohaname vaḍisīni
yĕsam̐ginanīvilāsa memisĕppede
(||sĕli||)
niliside nībagaḍu niluvu nūru vaṁḍīni
sŏlaside nīveḍuga jobbilī nide
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍelinala mel maṁgavu
yĕlayiṁpunī vŏrabu lemisĕppede