Seliyaro nee magamdu seppinattu melamgamgaa

చెలియరో నీ మగఁడు చెప్పినట్టు మెలఁగఁగా
Language

(॥పల్లవి॥)
చెలియరో నీ మగఁడు చెప్పినట్టు మెలఁగఁగా
పలు పచారములేలే భాగ్యవంతురాలవు

(॥చెలి॥)
తలఁచినట్టి(ట్టె?) కాఁగా తమకించ నేమిటికే
పొలసి వలపు గాదెఁ బోతువుగాక
పలికినట్టె కాఁగా పదరఁగ నేఁటికే
పిలిచి విభుని నొద్దఁ బెట్టుకొందువుగాక

(॥చెలి॥)
సేసినట్టె కాఁగాను చెక్కు చెయ్యేమిటికే
సేసవెట్టి పెండ్లి పీఁట చేకొందుగాక
వా(వ్రాఁ?)సినదె వాఁ(వ్రాఁ?) తగాఁగా వట్టి చలమేఁటికే
ఆసదీర మోవితేనె లానుదువుగాక

(॥చెలి॥)
చూచినట్టె కాఁగాను సుద్దు లిఁక నేఁటికే
కాచుక రతులమేలు గందువుగాక
యేచి శ్రీవేంకటేశ్వరుఁ డేలె నలమేల్మంగవు
చేచేత సంతోసాలఁ జెలఁగుదువుగాక

(||pallavi||)
sĕliyaro nī magam̐ḍu sĕppinaṭṭu mĕlam̐gam̐gā
palu pasāramulele bhāgyavaṁturālavu

(||sĕli||)
talam̐sinaṭṭi(ṭṭĕ?) kām̐gā tamagiṁcha nemiḍige
pŏlasi valabu gādĕm̐ boduvugāga
paliginaṭṭĕ kām̐gā padaram̐ga nem̐ṭige
pilisi vibhuni nŏddam̐ bĕṭṭugŏṁduvugāga

(||sĕli||)
sesinaṭṭĕ kām̐gānu sĕkku sĕyyemiḍige
sesavĕṭṭi pĕṁḍli pīm̐ṭa segŏṁdugāga
vā(vrām̐?)sinadĕ vām̐(vrām̐?) tagām̐gā vaṭṭi salamem̐ṭige
āsadīra movidenĕ lānuduvugāga

(||sĕli||)
sūsinaṭṭĕ kām̐gānu suddu lim̐ka nem̐ṭige
kāsuga radulamelu gaṁduvugāga
yesi śhrīveṁkaḍeśhvarum̐ ḍelĕ nalamelmaṁgavu
seseda saṁtosālam̐ jĕlam̐guduvugāga