Seliya naa vinnabamu sittaanam bettumanu

చెలియ నా విన్నపము చిత్తానఁ బెట్టుమను
Language

(॥పల్లవి॥)
చెలియ నా విన్నపము చిత్తానఁ బెట్టుమను
తెలిపేనంటే నంత దిట్టఁగాను నేను

(॥చెలి॥)
ఆసపడ్డ ముద్దరాల నలయించవద్దను
సేసవెట్టి మరి రట్టు సేయకుమను
పాసి పోక మొక్కఁగాను పరాకు సేయకుమను
రాసి కెక్కె నా వలపు రక్షించుమను

(॥చెలి॥)
కాఁపురము సేయఁగాను కాకుసేయదగదను
చేపట్టి వదలరాదు చెప్పితినను
యేపొద్దూ నేమొక్కఁగాను యెరవు గాకుండుమను
నా పసలన్నీ నెరుఁగు నన్ను నేలుకొమ్మను

(॥చెలి॥)
నే నలమేలుమంగను నెపాలు చప్పకుమను
పూని నాతో నవ్వె నిఁకఁ బోకుమను
తాను శ్రీవేంకటేశుఁడు తగులైతి నుండుమను
తానక మాయ పొందు తలపోసుకొమ్మను

(||pallavi||)
sĕliya nā vinnabamu sittānam̐ bĕṭṭumanu
tĕlibenaṁṭe naṁta diṭṭam̐gānu nenu

(||sĕli||)
āsabaḍḍa muddarāla nalayiṁchavaddanu
sesavĕṭṭi mari raṭṭu seyagumanu
pāsi poga mŏkkam̐gānu parāgu seyagumanu
rāsi kĕkkĕ nā valabu rakṣhiṁchumanu

(||sĕli||)
kām̐puramu seyam̐gānu kāguseyadagadanu
sebaṭṭi vadalarādu sĕppidinanu
yebŏddū nemŏkkam̐gānu yĕravu gāguṁḍumanu
nā pasalannī nĕrum̐gu nannu nelugŏmmanu

(||sĕli||)
ne nalamelumaṁganu nĕbālu sappagumanu
pūni nādo navvĕ nim̐kam̐ bogumanu
tānu śhrīveṁkaḍeśhum̐ḍu tagulaidi nuṁḍumanu
tānaga māya pŏṁdu talabosugŏmmanu