చెలిచిత్త మెఱఁగక చిమ్మి రేఁగే వింతేకాక
(॥పల్లవి॥)
చెలిచిత్త మెఱఁగక చిమ్మి రేఁగే వింతేకాక
తలఁపు లిద్దరికిని తారుకాణే కాదా
(॥చెలి॥)
చూపుల సొలసి నిన్నుఁ జూచె నింతేకాక వేరే
కోపగించుకొనెనా కొమ్మ నీతోను
పూఁపునఁ బూఁచి పూఁచి పుప్వులు పైఁజల్లెఁగాక
మోపులు గట్టి వేసెనా ముప్పిరిఁ బంతాలు
(॥చెలి॥)
పొద్దువంక చూసి నీకు బొమ్మలార్చె నింతేకాక
అద్దలించివేసెనా యంగన నిన్ను
పెద్దరికాన నింటికిఁ బిలిచి వెనఁగెఁగాక
వుద్దండాలు సేసి నిన్ను వొడివట్టి తీసేనా
(॥చెలి॥)
తోదోపుల నీతొడపైఁ దొడ వేస నింతేకాక
పాదము దాఁకించెనా పడఁతి నిన్ను
యాదెస శ్రీవేంకటేశ యెనయఁగా మెచ్చెఁగాక
నాదించి వినోదాలకు నవ్వించెనా నిన్నును
(||pallavi||)
sĕlisitta mĕṟam̐gaga simmi rem̐ge viṁtegāga
talam̐pu liddarigini tārugāṇe kādā
(||sĕli||)
sūbula sŏlasi ninnum̐ jūsĕ niṁtegāga vere
kobagiṁchugŏnĕnā kŏmma nīdonu
pūm̐punam̐ būm̐si pūm̐si pupvulu paim̐jallĕm̐gāga
mobulu gaṭṭi vesĕnā muppirim̐ baṁtālu
(||sĕli||)
pŏdduvaṁka sūsi nīgu bŏmmalārsĕ niṁtegāga
addaliṁchivesĕnā yaṁgana ninnu
pĕddarigāna niṁṭigim̐ bilisi vĕnam̐gĕm̐gāga
vuddaṁḍālu sesi ninnu vŏḍivaṭṭi tīsenā
(||sĕli||)
todobula nīdŏḍabaim̐ dŏḍa vesa niṁtegāga
pādamu dām̐kiṁchĕnā paḍam̐ti ninnu
yādĕsa śhrīveṁkaḍeśha yĕnayam̐gā mĕchchĕm̐gāga
nādiṁchi vinodālagu navviṁchĕnā ninnunu